Site icon NTV Telugu

Gurugram: గురుగ్రామ్‌లో దారుణం.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్‌రేప్

Gurugram

Gurugram

దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు మాత్రం అగడం లేదు. ఎక్కడొక చోట అబలలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముంబైలో ఒక డెలివరీ బాయ్.. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనను మరువక ముందే గురుగ్రామ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. స్నేహితుడి పిలుపు మేరకు పార్టీకి వెళ్లిన పాఠశాల ఉపాధ్యాయురాలిపై అత్యంత దారుణంగా జిమ్ శిక్షకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!

గురుగ్రామ్‌కు చెందిన ఒక మహిళ భర్తతో కలిసి నివసిస్తుంది. ఒక ప్రముఖ పాఠశాలలో విదేశీ భాషలు బోధిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 37 ఏళ్ల గౌరవ్ అనే వ్యక్తి సెప్టెంబర్‌లో జరిగిన ఓ పార్టీలో స్నేహితుడు అయ్యాడు. అనంతరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని సంభాషించుకుంటున్నారు. అంతేకాకుండా పలుమార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న గౌరవ్ ఫోన్ చేసి పర్సనల్‌గా కలుసుకుని మాట్లాడుకుందామని ఆహ్వానించాడు. దీంతో గురుగ్రామ్‌లోని గౌరవ్ స్నేహితుడైన నీరజ్ (32) ఇంటికి రావాలని చిరుమానా పంపించాడు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆమె నీరజ్ ఇంటికి చేరుకుంది. ఆమె ఇంటికి రాగానే గౌరవ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా స్నేహితులైన నీరజ్, యోగేష్ (29), అభిషేక్ (28) లకు ఫోన్ చేసి రప్పించాడు. అనంతరం ఆ ముగ్గురు కూడా వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది.

ఇది కూడా చదవండి: Gyanesh Kumar: బీహార్‌లో ఈసారి కొత్త విధానం.. బూత్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పిన సీఈసీ

మరుసటి రోజు ఉదయం బాధిత మహిళ ఉమెన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని.. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు.

Exit mobile version