Site icon NTV Telugu

Hijab Issue: చల్లార‌ని హిజాబ్ వ్య‌వ‌హారం… ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రించిన విద్యార్ధులు…

క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వ్య‌వ‌హారం చ‌ల్లార‌డం లేదు. ఈ విష‌యంలో క‌ర్ణాట‌క హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఈరోజు నుంచి క‌ర్ణాట‌క‌లో తిరిగి స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే, క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ ఊహించ‌ని ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. శివ‌మొగ్గ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వెళ్తున్న కొంద‌రు ముస్లీం యువ‌తుల‌ను ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. హాజాబ్‌ను తీసివేసి స్కూల్ లోప‌లికి వెళ్లాన‌ని కోరారు. ఉపాధ్యాయుల విన్న‌పాన్ని యువ‌తులు అంగీక‌రించ‌లేదు. ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ విద్యార్థినిలు స‌సేమిరా అన‌డంతో వారిని వెన‌క్కి పంపించేశారు.

Read: Viral: బామ్మ‌గారి ఇంగ్లీష్‌కి ఇంట‌ర్నెట్ ఫిదా…

ప‌దోత‌ర‌గ‌తి ప్రిప‌రేష‌న్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, త‌మ‌ను అనుమ‌తించ‌డం లేద‌ని విద్యార్థినులు ఇంటికి వెళ్లి త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. విద్యార్థినులు పేరెంట్స్ తీసుకొని పాఠ‌శాల వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థినుల తల్లిదండ్రుల‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, వారు కూడా ఒప్పుకోలేదు. హిజాబ్‌తో విద్యార్థినుల‌ను లోనికి అనుమ‌తించేది లేద‌ని చెప్ప‌డంతో విద్యార్థినులను తీసుకొని వెన‌క్కివెళ్లిపోయారు. శివ‌మొగ్గ‌లో జరిగిన ఈ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Exit mobile version