Site icon NTV Telugu

Haryana: 45 మంది చిన్నారులతో లోయలో పడ్డ స్కూల్ బస్సు.. రంగంలోకి దిగిన యంత్రాంగం

Haryanaschoolbusaccident

Haryanaschoolbusaccident

హర్యానాలోని పంచకులలో ఘోర ప్రమాదం జరిగింది. 45 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు లోయలో పడింది. చిన్నారుల బస్సులోంచి చెల్లాచెదురుగా పడిపోయారు. టిక్కర్ తాల్ సమీపంలో బస్సు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.

హర్యానాలోని పంచకుల జిల్లాలో శనివారం 45 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, డ్రైవర్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. టిక్కర్ తాల్ సమీపంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలో పడినట్లు చెప్పారు. మిగతా పిల్లలంతా క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులందరినీ రక్షించి పంచకుల సెక్టార్-6లోని ఆస్పత్రికి తరలించారు. బస్సు లోయలో పడగానే కొండగట్టులో ఇరుక్కుపోయింది. ప్రమాద సమయంలోనే పలువురు చిన్నారులు బస్సులోంచి బయటకు విసిరేసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

Exit mobile version