NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్‌లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాన నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ఈ రోజు పార్లమెంట్‌లో ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తమకు దేశం మొదటి ప్రాధాన్యత అని అన్నారు. విపక్ష నేతలు మణిపూర్‌పై చర్చించాలని పట్టుబడుతున్నా, లోక్‌సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రధాని తన విమర్శల దాడిని కొనసాగించారు. అవినీతిని అసలు సహించేది లేదని చెప్పారు. ప్రజలు తమను మరోసారి ఎన్నుకున్నారని, కొంతమంది బాధను తాను అర్థం చేసుకోగలనని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Read Also: West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!

తమకు దేశం ముఖ్యమని, ఏ విషయంలోనైనా దీన్నే ప్రాధాన్యతగా తీసుకుంటామని చెప్పారు. ఎన్ని కుట్రలు ఆరోపణలు చేసినా, విపక్షాలు ఓడిపోయాయన్నారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలను నమ్మి తమను మూడోసారి దేశ ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. దేశ ప్రజలు సెక్యులరిజం కోసం ఓటేసి మమ్మల్ని గెలిపంచారని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరించారని చెప్పారు.

2014 నాటికి ముందు దేశ ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని, దేశం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని, అలాంటి సమయం 2014కి ముందే ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ వార్తపత్రిక చూసిన కుంభకోణాలే కనిపించేవని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయని అన్నారు. 2014కి ముందు టెర్రరిస్టులు ఎక్కడికైనా వచ్చి దాడులు చేసేవారని, అమాయకుల్ని చంపారని అన్నారు. ఇప్పుడు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి హతమారుస్తున్నామని, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పారు.