NTV Telugu Site icon

Scammer: పోలీస్ యూనిఫాం ధరించిన స్కామర్.. నిజమైన పోలీస్‌కే ఫోన్ చేసి చిక్కాడు..

Scammer

Scammer

Scammer: ఇటీవల కాలంలో స్కామర్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టులు చేస్తూ.. కోట్ల రూపాయాల్ని దండుకుంటున్నారు. వీరి చేతుల్లో అమయాకులు బలి అవుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ స్కామర్ పోలీస్ డ్రెస్ వేసుకుని, ఓ వ్యక్తిని భయపెట్టాలని చూశాడు. అయితే, స్కామర్‌కి తాను మాట్లాడుతున్నది ఓ పోలీస్ అధికారి గురించి తెలియక అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌లో జరిగింది.

ముంబై పోలీస్ అధికారిగా నటించిన స్కామర్, త్రిసూర్ సిటీ పోటీస్ అధికారికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. తాను ఒక బకరాకు ఫోన్ చేస్తున్నా అని స్కామర్ అనుకున్నాడు, చివరకు తానే బకరా అయ్యాడు. త్రిసూర్ పోలీస్ సైబర్ సెల్ అధికారికి స్కామర్ ఫోన్ చేశాడు. పోలీస్ యూనిఫాం ధరించిన మోసగాడు ముంబైకి చెందిన అధికారిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. అయితే, అధికారి మొదట్లో కెమెరా ఆఫ్ చేసి స్కామర్‌తో మాట్లాడాడు.

Read Also: Maharashtra: ‘‘బాటేంగే తో కటేంగే’’.. మిత్రపక్షం అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..

స్కామర్ మీరు ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించగా, నిజమైన పోలీస్ అధికారి ‘‘నా కెమెరా సరిగా పనిచేయడం లేదు సార్’’ అని సమాధానం ఇచ్చాడు. స్కామర్ కెమెరా ఆన్ చేయాలని పట్టుబట్టాడు. ‘‘ఈ పని మానేయండి, మీ అడ్రస్, మీరుంటున్న చోటు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇది సైబర్ సెల్. మీరు ఈ పనిచేయడం మానేయడం మంచిది’’ అని మోసగాడిని పోలీస్ అధికారి హెచ్చరించాడు.

ఈ వీడియో వైరల్‌గా మారింది. మంగళవారం త్రిసూర్ సిటీ పోలీసులు షేర్ చేసిన క్లిప్ త్వరగా వైరల్ అయింది. కేవలం కొన్ని గంటల్లో, ఇది రెండు లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. “మీరు అందరినీ మోసం చేయగలరని మీరు అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. పూర్ ఫెల్లో అతను ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా గుర్తించలేదు!” అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు, ‘‘అతను చాలా కాలం ఇక యూనిఫాం ధరించడు’’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు.