Scalp, Hammer: “స్కాల్ప్, హామర్”లతో పాకిస్తాన్లో దీపావళి.. ఈ ఆయుధాలనే భారత్ ఎందుకు వాడింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scalp, Hammer: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సింధూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేతో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లోకి దూరి ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 80 మంది వరకు ఉగ్రవాదులను హతం చేసింది. ముఖ్యంగా, బలహల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు.
ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో భారత్ వాడిని ఆయుధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, రాఫెల్ జెట్స్కి అమర్చిన హామర్ ప్రెసిషన్-గైడెడ్ ఆయుధాలను ఎంచుకుంది. వీటితో పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించింది. ఈ రెండు క్షిపణులను ఉపయోగించి, నిర్ధిష్ట ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసింది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా ఉండేందుకు వీటిని వాడారు.
Also Read
స్కాల్ప్/ స్టార్మ్ షాడో:
స్టార్మ్ షాడో అని పిలువబడే స్కాల్ప్ క్షిపని, లాంగ్ రేంజ్ లోతైన దాడుల కోసం రూపొందించారు. దీనికి స్టెల్త్ లక్షణాల ఉంటాయి. అంటే శత్రువు రాడార్లకు చిక్కకుండా దాడులు చేయగలదు. ఇది ఎయిర్ నుంచి ప్రయోగించగలిగే క్రూయిజ్ మిస్సైల్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వీటిని వాడుతున్నాయి. రాత్రి పూట, అన్ని వాతావరణ సమయాల్లో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. 450 కి.మీ రేంజ్ కలిగిన స్కాల్ప్ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. దీనిలో అధునాతన నేవిగేషన్ సిస్టమ్ ఉంది. ఇది ఐఎన్ఎస్, జీపీఎస్, భూతలం నుంచి వచ్చే సూచనల ద్వారా పనిచేస్తుంది. దీనిని యూరోపియన్ కన్సార్టియం అయిన MBDA తయారు చేసింది.
బంకర్లు, మందుగుండు సామాగ్రిలోకి చొచ్చుకుపోగలదు. రష్యాలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఉక్రెయిన్ వీటిని వాడుతోంది. లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, క్షిపణిలోని ఇన్ఫ్రారెడ్ సీకర్ టార్గెట్‌ని గుర్తించి, దానిలోకి చొచ్చుకుపోతుంది. 450 కిలోల బరువున్న వార్ హెడ్‌ని ఇది మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని గుర్తించడం శత్రువులకు చాలా కష్టం.

హామర్:
ఆపరేషన్ సింధూర్ కోసం ఉపయోగించిన మరో ఆయుధం హామర్ (హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్), అన్ని వాతావరణాలలో ఉపయోగించగల ఎయిర్ టూ సర్ఫేజ్కి ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ బాంబు. దీనిని గ్లైడ్ బాంబ్‌గా పిలుస్తారు. ఇది 70 కి.మీ పరిధి కలిగి ఉంటుంది. దీనికి 250, 500, 1000 కిలోల బాంబుల్ని అమర్చవచ్చు. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ దీనిని తయారు చేసింది.
కఠినమైన భూభాగంపై తక్కువ ఎత్తు నుండి ప్రయోగించబడుతుంది. దీనిని అడ్డగించడం కష్టం. బలమైన భవనాల గుండా చొచ్చుకుపోతుంది. జైషే మహ్మద్, లష్కర్ కార్యాలయాలను దీనితోనే భారత్ నాశనం చేసిందింది.

తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!