భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడింది. భారత్ కొట్టిన దెబ్బకు దాయాది దేశం వణికిపోయింది. దెబ్బకు శత్రు దేశం కాళ్ల బేరానికి వచ్చింది. అంతగా పాకిస్థాన్ హడలెత్తిపోయింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్‌లో ఏఏ ప్రాంతాలు ధ్వంసమయ్యాయో.. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Kolkata: కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. హై అలర్ట్ ప్రకటన
భారత్ చేపట్టిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో హ్యాంగర్లు, రన్‌వేలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రన్‌వేలపై గుంటలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించినవి చిత్రాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులు చేసింది.
ఇది కూడా చదవండి: Khawaja Asif: ఇంగ్లీష్ రాకుంటే ఎందుకు మీడియా ముందుకు..? పాక్ రక్షణ మంత్రి కామెడీ మామూలుగా లేదు..
అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీతో తీసిన హై-రిజుల్యూషన్ చిత్రాలు బయటకు వచ్చాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, సింద్‌లోని సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్ వంటి వైమానిక సైనిక స్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. చిత్రాల్లో భారీగా నష్టం జరిగినట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సింధ్‌లోని షాబాజ్ జకోబాబాద్, ఉత్తర తట్టాలోని భోలారి ప్రాంతాలు ఉన్నాయి.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ముందే పురుషులను కాల్చి చంపేశారు. దీంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఎలాగైనా పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. దీంతో మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌పై భారత వాయుసేన మెరుపుదాడులు చేసింది. దీంతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసం అయింది. అంతేకాకుండా వంద మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
