NTV Telugu Site icon

Fake Swamiji: ఓర్నీ.. ఏంది సామీ ఇదీ.. విగ్రహాలను కొట్టేసింది నువ్వేనా!

Fake Swami

Fake Swami

Fake Swamiji: ప్రజల నమ్మకాలను టార్గ్‌ట్‌ చేస్తూ దొంగ స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. ప్రజల నమ్మకాలను టార్గెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈకాలంలోకూడా ఇలాంటి వారు ఉండటం అతిశయోక్తిలేదు. ఈకాలంలో కూడా స్వామీ జీ మాటలు నమ్ముతున్నామంటే అది మన అవివేకమో లేక మూఢత్వమో అనే చెప్పాలి. స్వామీజీ ముసుగులో పేరు తెచ్చకునేందుకు ఏపని చేయాడనికైనా సిద్దమవుతున్నారు దొంగ స్వామీలు. వీరి వల్ల అసలు స్వామీజీలకు మాయని మచ్చలా మారుతోందనే చెప్పొచ్చు. స్వామీజీ ముసుగులో అనేక కార్యకలాపాలు చేస్తుంటే మరొకొందరు అదే పేరును ఫేమస్‌ చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.

Read also: Tollywood: టాలీవుడ్‌ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత

వారు ఫేమస్‌ అయ్యేందుకు గుడిని గుడిలో లింగాన్ని కూడా వదలడం లేదు. ఓ స్వామీజీ చేసిన అడ్డదిడ్డమైన పనికూడా అలాంటిదే తన తెలితక్కువ పనికి తనే కాదు తనకు సహకరించిన వారు కూడా కటకటాలపాలయ్యారు. తను ఫేమస్‌ కావడానికి గుడిలోని విగ్రహాలను వాడుకున్నాడు. తన సహచరులతో గుడిలో విగ్రహాలను దొంగలించేందుకు పథకం ప్రకారం స్కెచ్‌ వేసి ఆతరువాత అక్కడి ఉన్న ప్రజలు తన వద్దకు వచ్చే విధంగా చేసుకుని ఆ విగ్రహాలు ఎక్కడ ఉన్నయో చెప్పి ఫేమస్‌ స్వామీజీగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడే ట్వీస్ట్‌ ఎదురైంది. గుడిలోని విగ్రహాలు ఎలా మాయమవుతున్నాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో ఆ బాబా చేసిన వింత పనికి అక్కడున్న ప్రజలే కాదు పోలీసులు కూడా అవాక్కయ్యురు. అతను ఫేమస్‌ అవడానికి గుడిలోని విగ్రహాలను టార్గెట్‌ చేశాడనే నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈఘటన తమిళనాడు తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Jr.NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం

తమిళనాడు తంజావూరు జిల్లాలో ప్రముఖ ఆలయాల్లో వరుస చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పురాతన విగ్రహాల అపహరణ పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ శరవణన్‌ అనే స్వామీజీని కలిస్తే విగ్రహాల దొంగతనాలు పరిష్కారం అవుతుందని ప్రజలు చెప్పడంతో చిన ఆలయ నిర్వహకులు శరవణన్ అనే స్వామిజిని ఆశ్రయించారు. అయితే పూజలు చేస్తానని, విగ్రహాలు ఎక్కడున్నాయో చెబుతానని చెప్పి నిర్వాహకులకు నమ్మబలికాడు. పూజలకు డబ్బులు అవసరమని, తనపై నమ్మకం పెట్టుకుని వచ్చిన వారిని వమ్ము చేయనంటూ ప్రగల్భాడు పలికాడు స్వామీ శరవణన్‌. పూజలు చేస్తే విగ్రహాల ఆచూకీ తెలుస్తుందని చెప్పిన ఫేక్‌ స్వామీ పూజలు మొదలు పెట్టాడు. ఏదో తనకు తెలిసిపోయినట్లు నటించి ఒకప్లేస్‌ చెప్పి అక్కడే విగ్రహాలు ఉన్నట్లు చెప్పాడు. దాంతో చిన ఆలయ నిర్వాహకులు ఫేక్‌ స్వామీజీ చెప్పిన ప్రదేశానికి వెళ్లారు.

Read also: Atal Bihari Vajpayee: “అటల్‌” మీకు “సలాం”..

అతను చెప్పినట్లు చోరీకి గురైన విగ్రహాలు అక్కడ ఉంటంతో షాక్‌ తిన్నారు. నిజమే అంటూ స్వామీజీని పూజలు చేయడం ప్రారంభించారు. దాంతో ఫేమస్‌ అయ్యారు స్వామీ. విగ్రహాల దొంగతనాని తెర పడింది అనుకునే లోపే పోలీసులు విగ్రహాలు ఎవరు దొంగతనం చేస్తున్నారు అనే కోణంలో విచారణ చేపట్టారు. చివరకు ఖంగు తున్నారు. ఈ తతంగం అంతా జరిపించింది.. జరిపిస్తోంది ఫేమస్‌ స్వామీజీనే అని తెలుసుకుని స్వామీజీ భరతం పట్టారు. ఈకేసులో ట్వీస్ట్‌ ల మీద ట్వీస్ట్ లు ఎదురుకొని చివరకు విగ్రహాల దొంగను ప్రజల ముందు నిలబెట్టారు. విగ్రహాలు చోరీ చేస్తోంది.. వాటి ఆచూకీ కనిపెడుతున్నది శరవణన్ అండ్ గ్యాంగ్ గా గుర్తించారు. శరవణన్ సహా ఆరుగురు అరెస్టు చేశారు. ఇలాంటి దొంగ స్వామీజీ మాయలో పడకండని ప్రజలకు సూచించారు.
Tunisha Sharma: నటి ఆత్మహత్య కేసులో పురోగతి.. సహాయ నటుడు అరెస్ట్

Show comments