NTV Telugu Site icon

Sanjay Raut: ఇది ప్రజా తీర్పు కాదు.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి గెలుస్తున్నారు..

Sanjay

Sanjay

Sanjay Raut: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎర్లీ ట్రెండ్‌ ప్రకారం ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 145 స్థానాలు దాటి.. 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇందులో సింగిల్ గానే భారతీయ జనతా పార్టీ 128 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి కేవలం 52 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై శివసేన (యూటీబీ) నేత సంజయ్‌ రౌత్‌ సంచలన కామెంట్స్ చేశారు. ఇది ప్రజా తీర్పు కాదు.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి మహాయుతి గెలుస్తోందని ఆరోపించారు.

Read Also: NC24 : నాగచైతన్య కొత్త సినిమాను పోస్టర్ తో అనౌన్స్ చేసిన మేకర్స్

కాగా, ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. మా సీట్ల కొన్ని దోచుకున్నట్లు సమాచారం.. ఇది ప్రజల నిర్ణయం కానేకాదు అని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తప్పేంటో అందరికీ క్లియర్ గా అర్థం అవుతోందన్నారు. ఈ ఫలితాలతో ప్రజలు కూడా ఏకీభవించలేదు.. ఏక్ నాథ్ షిండేకు 60 సీట్లు, అజిత్‌ పవార్‌కు 40, బీజేపీకి 125 సీట్లు రావడం అసాధ్యం అని సంజయ్ రౌత్ అన్నారు.

Read Also: Maharashtra Election Results: వెనుకంజలో ఆదిత్య ఠాక్రే..

ఇక, ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన అభ్యర్థులు అందరూ ముందంజలో కొనసాగడంపై సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. బాల్ థాక్రే స్థాపించిన శివసేనను చీల్చిన షిండే, ఎన్సీపీ పార్టీని చీల్చిన అజిత్ పవార్‌పై మరాఠా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వాళ్లు చేసిన మోసాన్ని ప్రజలు ఎలా మరిచిపోతారని చెప్పుకొచ్చారు. అయితే, కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమకు స్పష్టమైన ఆధిక్యం వచ్చిన.. ఈ ఫలితాలు ఎలా మారాయని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రజా తీర్పు కాదు.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మహాయుతి కూటమి గెలుస్తోందని సంజయ్ రౌత్ ఆరోపించారు.