Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
- ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’..
- సంజయ్ రౌత్ పోస్టుతో రాజకీయ విమర్శలు..
- రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ, జేడీయూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: అల్బేనియా దేశంలో సుప్రీంకోర్టును ఆందోళనకారులు తగలబెట్టిన ఘటనపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ వివాదానికి కారణమైంది. ‘‘అల్బేనియా ప్రజలు సుప్రీంకోర్టును తగలబెట్టారు. సుప్రీంకోర్టు అవినీతిపరులైన ప్రధాన మంత్రులకు సహాయం చేస్తోందనే కోపంతో వారు ఈ పని చేశారు. నిరసన చేస్తున్న ప్రజలు పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మంత్రుల ఇళ్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల నుంచి అన్ని దేశాలు గుణపాఠాలు నేర్చుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పరోక్షంగా భారతదేశ సుప్రీంకోర్టును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
సంజయ్ రౌత్ చేసిన పోస్టుపై బీజేపీ, జేడీయూతో పాటు సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. శివసేన యూబీటీ నేత ప్రియాంకా చతుర్వేది సంజయ్ రౌత్‌పై విమర్శలు చేశారు. భారత్ మరే ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని, అల్బేనియా చిన్న దేశమని, అది చాలా కాలం కమ్యూనిస్టుల నియంతృత్వంలో గడిపిందని ప్రియాంకా చతుర్వేది అన్నారు. ఆమె హింసాత్మక నిరసనలను, రాజ్యాంగ సంస్థల్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. ప్రతిపక్షాలు దేశంలో అరాచకాన్ని వ్యాప్తి చేయాలని చూస్తోందని బీజేపీ, జేడీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read
- Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
- Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
ముంబైలో ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగితే అరాచకం వ్యాపించడం ఖాయమని, సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించాలి.మాకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉంది, దేశాన్ని కాపాడగలిగేది సుప్రీంకోర్టు మాత్రమే. మన సొంత దేశంలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోతే మనం ఏం చేయగలం? ఇది అరాచకాన్ని వ్యాపింపజేస్తుంది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించాలి.’’ అని అన్నారు.
మరోవైపు.. సంజయ్ రౌత్ లాగే, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఇలాంటి పోస్టునే చేశారు. దీనిపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య మాట్లాడుతూ.. అల్బేనియాలో సుప్రీంకోర్టును తగలబెట్టడాన్ని సంజయ్ రౌత్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సమర్థిస్తున్నాయని ఆరోపించారు. సంజయ్ రౌత్ భారత రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను విమర్శించారు, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని దూషించి, అల్బేనియా సుప్రీంకోర్టును తగలబెట్టడాన్ని సమర్థిస్తున్నారని మండిపడ్డారు.
अल्बानियात लोकांनी सर्वोच्च न्यायालय जाळून टाकले.
सर्वोच्च न्यायालय भ्रष्ट पंतप्रधानांना मदत करत असल्याने लोक भडकले होते. आंदोलक जनतेने संसद आणि सरकारी कार्यालयांवर,मंत्र्यांच्या घरांवर देखील हल्ले केले आहेत.
सर्व देशांनी या घटनांपासून धडा घेतला पाहिजे.
विशेषतः 🇮🇳 https://t.co/3JSMJCMjXA— Sanjay Raut (@rautsanjay61) October 19, 2026
తాజావార్తలు
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
-
COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!