Site icon NTV Telugu

Bengaluru Blast: సంజయ్, ఉదయ్ వంటి హిందూ పేర్లు ఉపయోగించిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులు..

Bemgaluru Blast

Bemgaluru Blast

Bengaluru Blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులును శుక్రవారం ఎన్ఐఏ పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేసింది. వీరిని విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ గుర్తింపును కప్పిపుచ్చుకునేందుకు హిందూ పేర్లను వాడినట్లు తేలింది. నిందితులిద్దరు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలు మారుపేర్లు ఉపయోగించుకుంటూ పలు ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు. 42 రోజలు తర్వాత పట్టుబడిని వీరు గెస్ట్‌హౌజ్, ప్రైవేట్ లాడ్జిల్లోనే బస చేశారు.

కర్ణాటక శివమొగ్గకు చెందిన ఇద్దరు నిందితులు ఐఈడీ ఉపయోగించి పేలుడు ప్రణాళికను అమలు చేశారు. వీరిద్దరు అరెస్టైన తర్వాత కోల్‌కతా గెస్ట్ హైజ్‌లో చెక్-ఇన్ అవుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. షాజిబ్, తహాలు మార్చి 25న ఈ గెస్ట్ హైస్‌లోకి ప్రవేశించి మూడు రోజులు అక్కడే ఉన్నారు. తాము కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పర్యాటకులమని సిబ్బందికి చెప్పారు. హోటల్ రిసెప్షనిస్ట్ అష్రఫ్ అలీ మాట్లాడుతూ.. వారు మార్చి 25న వచ్చి వారి గుర్తింపు కార్డులను చూపించారని, మేము వారికి గదుల్ని ఇచ్చామని, మార్చి 28న హోటల్ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. మేము హోటల్ లోపల ఆహారం అందించమని, దీంతో వారిద్దరు బయటకు వెళ్లి తిని వచ్చేవారని, ఇద్దరు మాట్లాడుకునేందుకు తమ ప్రాంతీయ భాషను ఉపయోగించారని చెప్పాడు.

Read Also: Sydney mall Attack: సిడ్నీ మాల్ కత్తిపోటు దాడిలో 6కి చేరిన మృతుల సంఖ్య.. అనుమానితుడి కాల్చివేత..

ప్రధాన సూత్రధారుడు అబ్దుల్ మతీన్ తాహా వసతి కోసం వివిధ ప్రాంతాల్లో హిందూ పేర్లను ఉపయోగించినట్లు తేలింది. విఘ్నేష్ వంటి పేర్లను ఇతర నకిలీ ఐడీ పత్రాలను ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. అరెస్టుకు ముందు వీరిద్దరు నాలుగు రోజులుగా న్యూదిఘాలోని ఓ లాడ్జిలో మకాం పెట్టారు. పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో తమ స్థావరాలను మార్చారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌కి చెంది యూషా షానవాజ్ పటేల్ అనే వ్యక్తికి చెందిన నకిలీ ఆధార్ కార్డును షాజిబ్ కోల్‌కతాలోని రెండు హోటళ్లలో ఉపయోగించాడు. తహా ఒక హోటల్‌లో కర్ణాటకకు చెంది విఘ్నేష్ బిడి, మరో హోటల్‌లో అన్మోల్ కులకర్ణి అని నకిలీ పేర్లను ఉపయోగించాడు. మరో హోటల్‌లో జార్ఖండ్ మరియు త్రిపురకు చెందిన సంజయ్ అగర్వాల్ మరియు ఉదయ్ దాస్ యొక్క గుర్తింపులను వాడుకున్నారు. తహా ఐటీ ఇంజనీర్ అయితే, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) శివమొగ్గ ఆధారిత మాడ్యూల్‌ను ప్రభావితం చేయడంలో షాజిబ్ కీలక వ్యక్తి అని అనుమానిస్తున్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో ఎన్ఐఏ , కేంద్ర నిఘా సంస్థలు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసు ఏజెన్సీలు అరెస్టుల కోసం సమన్వయంతో పనిచేశాయి.

Exit mobile version