Site icon NTV Telugu

Sambhal mosque: సంభాల్ మసీదు అధ్యక్షుడి అరెస్ట్..

Sambhal Mosque

Sambhal Mosque

Sambhal mosque: గతేడాది ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో హింస చెలరేగింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లి మూక దాడులకు పాల్పడింది. ఈ అల్లర్లలో దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నలుగురు మరణించారు, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 24న జరిగిన ఈ అల్లర్లకు సంబంధించి, యూపీ పోలీసులు ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు.

Read Also: MS Dhoni: రిటైర్మెంట్‌ పుకార్లపై ఎంఎస్ ధోనీ క్లారిటీ..

ఇదిలా ఉంటే, నవంబర్ 24న జరిగిన హింసాకాండ కేసుకు సంబంధించి వాగ్మూంలాన్ని నమోదు చేయడానికి స్థానిక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం షాహి జామా మసీదు అధ్యక్షుడు జాఫర్ అలీని కస్టడీలోకి తీసుకుంది. మొఘల్ కాలంలో ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చి ఇక్కడ మసీదు నిర్మించినట్లు కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు మీసదు సర్వేకి అనుమతించిన తర్వాత అల్లర్లు చోటుచేసుకున్నాయి. హింసాకాండపై స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకే, మసీదు అధ్యక్షుడిని అరెస్ట్ చేసినట్లు సంభాల్ కొత్వాలి ఇన్‌చార్జి అనుజ్ కుమార్ తోమర్ తెలిపారు. ఈ హింసలో అతడి ప్రమేయం ఉందా..? అనే కోణంలో ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version