NTV Telugu Site icon

UP: మైనర్‌ బాలికపై సమాజ్‌వాదీ పార్టీ నేత అత్యాచారయత్నం.. బీజేపీ, ఎస్పీల మధ్య మాటల యుద్ధం..

Up

Up

UP: ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడు 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. సోమవారం, యూపీ పోలీసులకు అర్ధరాత్రి 1.30 గంటలకు 112 హెల్ప్‌లైన్ నెంబర్‌కి రక్షించాలని ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ‘‘ నిన్న రాత్రి 1.30 గంటల సమయంలో యూపీ 112కి కాల్ వచ్చింది. అందులో ఓ అమ్మాయి తన బట్టలు విప్పి దాడికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది’’ అని కన్నౌజ్ ఎప్సీ అమిత్ కుమార్ ఆనంద్ తెలిపారు.

సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోటీసులు బాలికను రక్షించారు. ఆ సమయానికి బాలిక ‘‘అభ్యంతరకరమైన స్థితి’’లో కనిపించిందని, పక్కనే ఉన్న నవాబ్ సింగ్ యాదవ్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తనకు ఉద్యోగ అవకాశాల కోసం తన తండ్రి, అత్త తనను నిందితుడి నవాజ్ సింగ్ యాదవ్‌ వద్దకు పంపినట్లు బాలిక పోలీసులకు చెప్పింది. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..

అయితే, ఈ ఘటన తనపై కుట్రగా నిందితుడు యాదవ్ ఆరోపించాడు. ఇది పెట్టుబడీదారుల కుట్రగా చెప్పాడు. అయితే, అతని ఆరోపణల్ని బాలిక ఖండించింది. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. నవాజ్ సింగ్ యాదవ్ వార్త రాగానే అతడిని సమాజ్‌వాదీ పార్టీ దూరం పెట్టింది. తమ పార్టీ సభ్యుడు కాదని చెప్పింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కొన్ని సంవత్సరాలుగా మాతో సంబంధం లేదని చెప్పింది.

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ విరుచుకుపడుతోంది. బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ తన నేతకు రక్షణగా నిలుస్తోందని ఆరోపించారు. నవాజ్ సింగ్ కేవలం ఎస్పీ నాయకుడే కాదు, అతను డింపుల్ యాదవ్ ప్రతినిధి అని చెప్పారు. నవాబ్ సింగ్‌పై కన్నౌజ్ సిటీ పోలీస్ స్టేషన్ మరియు తిర్వా పోలీస్ స్టేషన్‌లో మొత్తం 16 కేసులు నమోదయ్యాయి, ఇందులో హత్యాయత్నం మరియు గూండా చట్టం కింద మరో మూడు కేసులు ఉన్నాయి.

Show comments