Samajwadi Party Leader Abbas Haider Mother And Wife In Lucknow Building Collapse Incident: లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్ హైదర్ తల్లి బేగం హైదర్ (72), భార్య ఉజ్మా(30) దుర్మరణం చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆ ఇద్దరిని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృత చెందారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలపాలవ్వడం వల్లే మృతి చెందినట్టు తేలింది. దీంతో అబ్బాస్ హైదర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లితో పాటు భార్య మృతి చెందడంతో.. ఆయన శోకసంద్రంలో మునిగారు. మరోవైపు.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని, శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సజీవంగా బయటకు తీశారు. ఇంకా ఆ శిథిలాల కింద మరో ఇద్దరు లేదా ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.
Pune Crime News: దారుణం.. ఏడుగురిని బలి తీసుకున్న ‘ప్రతీకారం’
ఇదిలావుండగా.. ఈ అలాయా అపార్ట్‌మెంట్ యజమానులైన మహ్మద్ తారిఖ్, నవాజీష్ షాహిద్, బిల్డర్ ఫహద్ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫహద్ యజ్దానీ నిర్మించిన ఈ భవనాన్ని 2009లో షాహిద్ మంజూర్ మేనల్లుడు మహ్మద్ తారిఖ్, ఆయన కుమారుడు నవాజీష్ షాహిద్ 2009లో మార్కెట్ ధర కన్నా రూ. 20 లక్షలకు తక్కువగా కొనుగోలు చేశారు. మంగళవారం అర్థరాత్రి ఈ భవనం ఉన్నపళంగా కుప్పకూలింది. ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అటు.. డివిజన్ కమిషనర్ రోషన్ జాకబ్ లక్నో డెవలప్‌మెంట్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే బిల్డర్ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే.. వాటిని కూడా కూల్చేయమని చెప్పారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్‌గా..