వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.. కానీ, ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు కాకరేపుతున్నాయి.. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాది పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా.. ఇస్లామిక్ ఉగ్రవాదులతో స్నేహం నెరుపుతాయని కాంగ్రెస్, ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన ఆయన.. పేదలకు డబ్బు ఆశ చూపి మదర్సాలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని ఫైర్ అయ్యారు.. ముస్లిం దేశాల నుంచి నేరుగా మతం మారిన పేదల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని ఆరోపించారు ఆనంద్ స్వరూప్.. మరోవైపు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తన హృదయం పాక్‌లో ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు యూపీ మంత్రి… అలాగైతే ఆమె ఆ దేశానికే వెళ్లిపోతే మంచిదంటూ సలహా ఇచ్చారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేస్తూ మతమార్పిళ్లకు పాల్పడటం రాజ్యాంగవిరుద్ధమని, ఈ వ్యవహారాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని సర్కార్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Anand Swaroop Shukla