NTV Telugu Site icon

Deputy Speaker: డిప్యూటీ స్పీకర్ బరిలో అయోధ్య ఎంపీ.. తృణమూల్ ప్లాన్..

Awadhesh Prasad

Awadhesh Prasad

Deputy Speaker: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్‌ని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదవారం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. అవధేష్ ఇటీవల అయోధ్య రామ మందిరం నిర్మితమైన ఫైజాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రామమందిరం నిర్మించిన కొన్ని నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఒక్కసారి అవధేష్ పేరు చర్చనీయాంశంగా మారింది.

READ ALSO: Honour Killing: తాగుదామని పిలిపించి అల్లుడిని చంపేసిన కుటుంబం.. సంచలనంగా ‘‘పరువు హత్య’’

17వ లోక్‌సభ సమయం నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి ఇప్పటి వరకు కేంద్రం షెడ్యూల్ విడుదల చేయలేదు. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఇష్టపడకపోవడంతో ఇటీవల లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టాయి. అయితే, సంఖ్యాబలంగా బీజేపీ కూటమికి ఎక్కువగా ఉండటంతో మూజువాణి ఓటులో బీజేపీ ఎంపీ ఓం బిర్లా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

అయితే, ఈసారి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫైజాబాద్ నుంచి గెలుపొందిన దళిత వ్యక్తి అవధేష్ ప్రసాద్ పేరును తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి చెందిన లల్లూ సింగ్‌పై అవధేష్ 50,000 కంటే ఎక్కువ ఓట్లతో గెలుపొందాడు. రామ మందిరం కట్టినా కూడా బీజేపీని ప్రజలు ఆదరించలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.