NTV Telugu Site icon

Salman Khan: మళ్లీ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. క్షమాపణ చెబుతారా.. రూ.5 కోట్లు ఇస్తారా..?

Salman

Salman

Salman Khan: మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత బాలీవుడ్‌ యాక్టర్ సల్మాన్‌ఖాన్‌కు వరుసగా హత్య బెదిరింపులు వస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో మరోసారి ముంబై పోలీసు ట్రాఫిక్‌ కంట్రోల్‌రూమ్‌కు చెందిన వాట్సప్‌ నంబరుకు సోమవారం అర్థరాత్రి తర్వాత ఈ బెదిరింపులతో కూడిన ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో సల్మాన్‌కు దుండగులు రెండు ఆప్షన్స్‌ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఆ సందేశంలో తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడిని.. సల్మాన్‌ఖాన్‌ ప్రాణాలతో ఉండాలంటే అతడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు. అలా జరగకపోతే మేం అతడిని చంపేస్తామని వార్నింగ్ మెసేజ్‌లో ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ సందేశంపై విచారణ కొనసాగిస్తున్నారు.

Read Also: NBK 109 : బాలయ్య సినిమాకి కొత్త తలనొప్పి.. 5 కోట్ల నష్టం?

కాగా, గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ దగ్గర ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు మరి కొందరు యత్నించారు.. ఇలా పలుమార్లు సంఘటనలను పోలీసులు దృష్టిలో పెట్టుకుని ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Show comments