NTV Telugu Site icon

Salman Khan: సిద్ధిక్ హత్యతో సల్మాన్ ఖాన్‌‌కు నిద్ర పట్టడం లేదు.. అన్ని మీటింగ్స్ రద్దు..

Salman Khan

Salman Khan

Salman Khan: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషాన్ సిద్ధిక్ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిక్‌ని కాల్చి చంపారు. దాడికి పాల్పడిన ముగ్గురు దుండగుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. ఈ హత్య విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. మరోవైపు ఈ ఘటన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు కారణమవుతోంది.

ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. షుబు లోంకర్ మహారాష్ట్ర అనే గ్యాంగ్ సభ్యుడు ఫేస్‌బుక్ పోస్ట్‌లో “ఓం, జై శ్రీరామ్, జై భారత్. నేను జీవితం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నాను. సంపద, శరీరాన్ని ధూళిగా భావిస్తున్నాను. నేను ఒక మంచి పని చేసాను. స్నేహం యొక్క కర్తవ్యాన్ని గౌరవించాను. సల్మాన్ ఖాన్, మేము యుద్ధం కోరుకోలేదు. కానీ నువ్వు మా అన్నయ్యని బాధపెట్టావు. సల్మాన్ ఖాన్, దావూద్‌తో తప్ప మాకు ఎవరితో శత్రుత్వ లేదు. ఎవరైతే వీరికి మద్దతు ఇస్తారో వారు పరిణామాలు ఎదుర్కోవాలి. ఎవరైనా మా వాళ్లను చంపితే తప్పకుండా రియాక్షన్ ఇస్తాం. మేం ఎప్పుడూ మొదట దాడి చేయం’’ అని పేర్కొన్నాడు.

Read Also: Cpi : “అలయ్‌ బలయ్‌”పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు.. వేదికపై కూనంనేని, రానన్న నారాయణ

సల్మాన్ ఖాన్‌కి అత్యంత ఆప్తుడైన సిద్ధిక్ మరణించడంపై ఆయన తీవ్రంగా మనోవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి సల్మాన్ ఖాన్, సిద్ధిక్ మరణంతో కుంగిపోయినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ గత రాత్రి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో సిద్ధిక్ మృతదేహాన్ని చూసి, బాంద్రాలోని తన నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్‌కి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి నిద్ర పోలేకపోయాడని సమచారం. ఇదిలా ఉంటే, సిద్ధిక్ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల భద్రత పెంచారు.

సల్మాన్ ఖాన్, సిద్ధిక్ అంత్యక్రియల ఏర్పాటును, ఇతర విషయాలను ఫోన్‌లో అడిగి తెలుసుకుంటున్నట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాబోయే కొద్ది రోజుల పాటు తన వ్యక్తిగత సమావేశాలను కూడా రద్దు చేసుకున్నాడు. బాబా సిద్ధిక్ మరణం సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. అర్బాజ్, సోహైల్ కూడా సిద్ధిక్‌కి చాలా సన్నిహితులు. తరుచుగా వీరంతా ఇఫ్తార్ పార్టీల్లో కలుసుకునే వారు. సిద్ధిక్ సల్మాన్‌ఖాన్‌ని స్నేమితుడిగానే కాకుండా, కుటుంబంలో ఒకడిగా ఉండేవారు. సిద్ధిక్ మరణవార్త తెలిసిన సమయంలో సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో ఉన్నారు. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఆస్పత్రికి చేరారు.