NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..

Saif

Saif

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యావత్ చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు రాజకీయ విమర్శలకు కూడా కారణమవుతోంది. దొంగతనం పాల్పడేందుకు వచ్చిన దుండగుడు, సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్‌ 6 కత్తిపోట్లకు గురయ్యాడు. మెడ, వెన్నుముక ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు సర్జరీలు జరిగాయి. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు చెప్పారు.

Read Also: Vishwak Sen: విశ్వక్ సేన్ ‘లైలా’ టీజర్‌ను ఎంజాయ్ చేసిన బాలయ్య

ఇదిలా ఉంటే, ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 2.33 గంటలకు సైఫ్ ఇంటికిలో దుండగుడు మెట్ల మార్గంలో వెళ్తున్న వీడియో సీసీటీవీలో రికార్డయ్యింది. దుండగుడి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీ షర్ట్, జీన్స్ ధరించిన వ్యక్తి మెట్లు దిగుతున్న వీడియో రికార్డ్ అయింది. వెళ్లిపోయే క్రమంలో అతను సీసీకెమెరా వైపు చూడటం గమనించవచ్చు.

సైఫ్ అలీ ఖాన్, అతని భార్య మరియు నటి కరీనా కపూర్ ఖాన్, వారి కుమారులు బాంద్రా వెస్ట్‌లోని 12 అంతస్తుల భవనంలో నాలుగు అంతస్తులలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. దొంగతనం చేసేందుకు దుండగుడు ఇంట్లో కి ప్రవేశించినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించడానికి అపార్ట్‌మెంట్ వెనక ఉన్న ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించాడు.