NTV Telugu Site icon

Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమళ ఆలయం.. పోటెత్తిన భక్తులు

Shabaramala Tenple

Shabaramala Tenple

Sabarimala Temple: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మండల పూజల అనంతరం మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం మళ్లీ తెరుచుకుంది. మకరవిళక్కు మకరజ్యోతి ఉత్సవాల కోసం శబరిమల తెరిచారు అధికారులు. ఈ నెల 27వ తేదీ రాత్రి మూసివేసిన అయ్యప్ప ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన అర్చకుడు కందారు మహేశ్ మోహనరావు శనివారం సాయంత్రం తెరిచారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రధాన అర్చకుడు పిఎన్ మహేష్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచారు. జనవరి 13న ప్రసాద శుద్ధ క్రియ.. 14న బింబ శుద్ధ క్రియ నిర్వహించనున్నట్లు శబరిమల ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. జనవరి 15న మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అయితే మకరజ్యోతి పూర్తయిన తర్వాత కూడా జనవరి 20 వరకు శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆలయాన్ని తెరిచి ఉంచనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. 41 రోజులుగా జరుగుతున్న మండల పూజల సందర్భంగా శబరిమలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Read also: Hyderabad Metro: న్యూ ఇయర్‌ ఆఫర్‌.. నేడు ఒంటిగంట వరకు మెట్రో సేవలు

వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో భక్తుల రద్దీని అదుపు చేయలేక కేరళ పోలీసులు ఒక దశలో లాఠీచార్జి కూడా చేశారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా 41 రోజుల మండల పూజల సీజన్‌కు భక్తులు పోటెత్తడంతో మకరజ్యోతి సందర్భంగా వర్చువల్ క్యూ లైన్ల టిక్కెట్ల జారీకి సంబంధించి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతికి భక్తుల రద్దీని నివారించేందుకు జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లను 50 వేలకు తగ్గిస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీసీ ప్రశాంత్ తెలిపారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు బుకింగ్‌లు లేకుండా ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్‌లను 10,000కు పరిమితం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ రెండు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా పంబకు వెళ్లే బదులు నిలక్కల్‌లో స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. 41 రోజుల్లో 241.71 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.
Top Headlines@ 9AM: టాప్‌ న్యూస్‌!