Site icon NTV Telugu

Sabarimala: రికార్డు స్థాయిలో అయ్యప్పకు ఆదాయం.. 10 రోజుల్లో రూ.52 కోట్లు

Sabarimala Temple

Sabarimala Temple

Sabarimala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. మండల, మకరవిలక్కు పూజల కోసం ఈనెల 16 నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కేవలం 10 రోజుల్లోనే రూ.52 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. అత్యధికంగా అరవణ ప్రసాదం విక్రయంతో రూ.23.57 కోట్లు, హుండీల ద్వారా రూ.12.73 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్లు వచ్చిందని దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9 కోట్లే వచ్చిందని ట్రావెన్‌కోర్టు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనంత గోపన్‌ వెల్లడించారు.

Read Also: Monkeypox: మంకీపాక్స్‌కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?

అటు వచ్చే 20 రోజులకు సరిపడా 51 లక్షల అరవణ ప్రసాదం డబ్బాలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయని ట్రావెన్‌కోర్టు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనంత గోపన్‌ తెలియజేశారు . రోజుకు సగటున రెండున్నర లక్షల డబ్బాల ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి భక్తుల సంఖ్యపై పరిమితి విధించడంతో ఆలయానికి ఆదాయం తగ్గిపోయింది. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలించడంతో గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించి అందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనం విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆన్‌లైన్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టైమ్ స్లాట్ విధానం వల్ల భక్తుల ఎక్కువ సేపు నిరీక్షణ లేకుండా సన్నిధానంలోకి చేరుకుంటున్నారు.

Read Also: China: జీ జిన్‌పింగ్‌ దిగిపో.. కొవిడ్‌ ఆంక్షలపై చైనీయుల ఆందోళనలు

Exit mobile version