SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్‌ను సీఎంను చేయండి!”
SA Chandrasekhar: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను తాజా ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ కీలక తరుణంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ (SAC) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే విజయ్‌తో చేతులు కలపాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్‌కు గొప్ప చరిత్ర ఉంది. కానీ ప్రస్తుతం అధికారానికి దూరమై ఆ పార్టీ ప్రాభవం తగ్గుతోంది. ఎవరో ఒకరికి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతోంది. ఆ పార్టీకి తిరిగి పూర్వవైభవం రావాలంటే వారికి అధికారం దక్కాలి. ఆ పవర్‌ను మా విజయ్ ఇస్తాడు. కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు అందుతున్నాయి.
Also Read
- Vijay TVK: "బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే 'తుపాకీ'! విజయ్ సీఎం అవుతాడా?
- West Bengal Results: తృణమూల్ కోటలో 'కమల' వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
- Trisha Political Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
- Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?
30 ఏళ్ల కల.. నేడు నిజం!
విజయ్ రాజకీయ ప్రయాణం గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. “గత 30 ఏళ్లుగా సమాజం కోసం, తమిళ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని విజయ్ తపిస్తున్నాడు. ఆ ఆలోచనల నుంచే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు” అని ధీమా వ్యక్తం చేశారు. తమిళ ప్రజలతో విజయ్‌కు ఉన్న అనుబంధం గురించి చంద్రశేఖర్ భావోద్వేగంగా మాట్లాడారు.. “తమిళనాడులో ప్రతి మహిళ విజయ్‌ను తన సొంత కొడుకులా భావిస్తుంది, యువత ఆయనను తమ అన్న అని పిలుచుకుంటారు, 60 ఏళ్ల వృద్ధురాళ్లు కూడా విజయ్‌ను తమ మనవడిగా చూసుకుంటారు. అందుకే ప్రజలు ఈ స్థాయి తీర్పునిస్తున్నారు” అని భావోద్వేగం అయ్యారు.
విజయ్ పార్టీ సొంతంగా సెంచరీ దాటేయడం, దానికి తోడు కాంగ్రెస్‌కు చంద్రశేఖర్ బహిరంగ ఆహ్వానం పలకడంతో ద్రవిడ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అటు డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, విజయ్ ఆఫర్‌పై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. విజయ్ ‘దళపతి’ నుంచి ‘ముఖ్యమంత్రి’గా మారేందుకు అడుగు దూరంలో ఉండటంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
#WATCH | Chennai, Tamil Nadu: On TVK, currently leading in 110 seats of the total 234 in the state, TVK chief Vijay’s father, SA Chandrasekhar, says, “… In the last 30 years, he had been thinking that he had to do something for society, for the Tamil people. It was there in his… pic.twitter.com/dF9sWG5RHI
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
-
SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్‌ను సీఎంను చేయండి!”
-
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
-
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
-
West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
-
Trisha Political Entry: త్రిష పొలిటికల్ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!