S Jaishankar’s Strong Reply To UK Minister: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం అయింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపధ్యంలోొ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీపై ఆరోపణలు గుప్పిస్తూ రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీ వివాదం ఇటు భారత్ లో అటు యూకేలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భారత్ ప్రభుత్వం అయితే దీన్ని ఏకంగా ‘‘ వలసవాద మనస్తత్వం’’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. ఈ పరిణామాల తర్వాత ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేసింది. భారత చట్టాలకు అనుగుణంగా అకౌంట్స్ నిర్వహించడం లేదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూకే విదేశాంగ మంత్రి జెమ్స్ జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఇరువురి మధ్య బీబీసీ వ్యవహారం చర్చలోకి వచ్చింది. అయితే దీనిపై ఎస్ జైశంకర్ యూకేకు ఘాటు రిఫ్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో పనిచేసే ఏ సంస్థ అయినా భారతీయ చట్టాలకు లోబడి ఉండాలని సూటిగా చెప్పారు. భారత్ లో పనిచేస్తున్న సంస్థలు ఇక్కడి చట్టాలు, నియమాలను పాటించాలని యూకే విదేశాంగ మంత్రికి చెప్పారు.
Read Also: Manchu Manoj: మోహన్ బాబు లేకుండానే మనోజ్ రెండో పెళ్లి..?
ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంట్ పై యూకే ఎంపీలు రెండుగా చీలిపోయారు. కొందరు ప్రధాని మోదీని సమర్థించగా.. మరికొందరు బీబీసీకి వత్తాసు పలికారు. అయితే బీబీసీని యూకే ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. ఇటీవల విదేశీ, కామన్వెల్త్ అభివృద్ధి పార్లమెంటరీ అండర్ సెక్రటరీ డేవిడ్ రూట్లీ మాట్లాడుతూ.. మేము బీబీసీకి అండగా నిలుస్తాం, బీబీసీకి నిధులు సమకూరుస్తాం, బీబీసీ ప్రపంచానికి ముఖ్యమైదనదిగా భావిస్తున్నామని అన్నారు. భారత్ తో సహా తమ మిత్రదేశాలు బీబీసీ ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ.. బీబీసీ డాక్యుమెంటరీ అనుకోకుండా వచ్చిన డాక్యుమెంటరీ కాదని, దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. మీరు భారత ప్రధాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా దీన్ని రూపొందిస్తారు..? అని ప్రశ్నించారు. భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే ఇలాంటి వాటి ఉద్దేశ్యమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
