Site icon NTV Telugu

Fact Check: S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై పాక్ ఫేక్‌ న్యూస్‌ ప్రచారం.. అసలు నిజం ఇదే!

S400

S400

Fact Check: పాకిస్తాన్ తప్పుడు ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తుంది. దానికి తోడుగా చైనా కూడా చేతులు కలిపింది. పాక్‌ వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్‌బైజన్‌ మీడియా సంస్థలు ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక, భారత్‌ దగ్గర అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400పై అసత్య ప్రచారం చేస్తుంది. శక్తిమంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పాక్‌కు చెందిన జేఎఫ్‌-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని దాయాది దేశ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పీటీవీ వార్తలు ప్రసారం చేసింది.

Read Also: #Single : సినిమా సింగిల్.. కానీ కలెక్షన్స్ డబుల్

అలాగే, ఈ దాడి పంజాబ్‌లోని ఆదంపుర్‌ దగ్గర జరిగినట్లు తెలిపింది. వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వరంగానికి చెందిన మీడియా సంస్థ షినువా ప్రచారం చేయగా.. మరోవైపు అజర్‌ బైజన్‌కు చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తను హడావుడిగా ప్రసారం చేసింది. మరోవైపు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విలువ 1. 5 బిలియన్ డాలర్లు ఉంటుందని పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఇండియన్ S-400 సిస్టమ్ ను దెబ్బ తీశాం మా మిస్సైల్స్ తో అని చెప్పుకొచ్చారు. ప్రతీకార దాడులు తప్ప.. మాకు మరో దారి లేదు.. మా సహనాన్ని భారత్ పరీక్షిస్తుంది అని అతడు చెప్పుకొచ్చారు.

Read Also: Operation Sindoor: పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్

అయితే, సోషల్ మీడియాలో కొనసాగుతున్న అసత్య ప్రచారంపై భారత మిలిటరీ విభాగం స్పందించింది. హైపర్‌ సోనిక్‌ క్షిపణితో ఎస్‌-400ను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం తప్పు అని వెల్లడించారు. ఎస్‌-400 డిఫెన్స్ సిస్టమ్.. నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకొవడానికి రష్యా దీనిని ఉపయోగిస్తుందన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు రష్యా, చైనా, టర్కీలు వీటిని వాడినట్లు తెలిపారు. విభిన్నమైన రాడార్లు, క్షిపణులు సమన్వయంతో పని చేసి ప్రత్యర్థుల ఫైటర్‌ జెట్స్‌, రాకెట్లు, మానవరహిత విమానాలను కూల్చేసే ఒక రక్షణ వ్యవస్థ ఇది అని భారత సైనికాధికారులు చెప్పుకొచ్చారు.

 

Exit mobile version