Site icon NTV Telugu

Banana Exports: భారత అరటిపండ్లకు ఫుల్ డిమాండ్.. రష్యాకు ఎగుమతి..

Banana Exports

Banana Exports

Banana Exports: అమెరికాతో సైనిక ఒప్పందంపై ఈక్వెడార్‌తో ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి అరటిపండ్లను దిగుమతి చేసుకోవాలని రష్యా భావించింది. దీంతో భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభయ్యాయి. భారత్ నుంచి మొదటి బ్యాచ్ అరటిపండ్లు జనవరిలో రష్యాకు ఎగుమతి అయ్యాయి. తదుపరి బ్యాచ్ ఫిబ్రవరి చివరిలో ఎగుమతి అవ్వనుందని రష్యన్ వాచ్‌డాగ్ రోసెల్‌ఖోజ్నాడ్జోర్‌ని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. రష్యన్ మార్కెట్‌కి భారత్ అరటిపండ్ల ఎగుమతులు పెరుగుతున్నట్లు పేర్కొంది.

ప్రపంచంలో ప్రధాన అరటిపండ్ల ఎగుమతిదారుల్లో ఇండియా ఒకటి. మామిడి, పైనాపిల్స్, బొప్పాయి, జామ వంటి ఇతర పండ్లను కూడా ఇండియా, రష్యాకు ఎగుమతి చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం ఈక్వెడార్, రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాకు ఎగుమతి అయ్యే ఈక్వెడార్ అరటిపండ్లపై నిషేధం విధించింది. ఇందులో తెగుళ్లను గుర్తించినట్లు రష్యా చెబుతోంది. అయితే, ఈ తమ అరటిపండ్లలో ఎలాంటి ప్రమాదం లేదని ఈక్వెడార్ చెబుతోంది. ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో గత వారం ఐదు ఈక్వెడార్ కంపెనీల నుంచి రష్యాకు అరటిపండ్ల దిగుమతులు నిలిపివేయబడ్డాయి.

Read Also: Pakistan: పోలింగ్‌కి ఒక రోజు ముందు పేలుళ్లతో దద్ధరిల్లిన పాక్.. 22 మంది మృతి..

ఈక్వెడార్ రష్యా ఆయుధాలను ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగిస్తుందని రష్యా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అరటిపండ్ల సంక్షోభం తెరపైకి వచ్చింది. దీంతో భారత్ నుంచి భారత్ నుంచి రష్యాకు అరటిపండ్ల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి రష్యా తన ఆర్థిక వ్యవస్థ కోసం ఇండియా, చైనాపై ఆధారపడుతోంది. ఎఫ్ఏఓ ప్రకారం.. 2022లో రష్యాకి ఈక్వెడార్ అతిపెద్ద అరటిపండ్ల ఎగుమతిదారుగా ఉంది. ఈక్వెడార్ తన వార్షిక అరటిపండ్ల ఎగుమతుల్లో, యుద్ధానికి ముందు 20-25 శాతం రష్యాకే ఉండేది.

Exit mobile version