
మనదేశంలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నది. అయితే, 60 నుంచి 70 శాతం ఈ వ్యాక్సిన్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నది. ఇండియాలో జూన్ నుంచి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ పై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు కావడంతో దీని ధర ఎంత ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అంతర్జాతీయంగా ఈ వ్యాక్సిన్ ను 10 డాలర్లకు విక్రయిస్తున్నారు. ఇండియాలో కూడా అదే ధరకు అంటే రూ.750 కి అందుబాటులో ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే, దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవగ్జిన్ లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెండు డోసులు కలిపి రూ.500 వరకు అందుబాటులో ఉన్నాయి.