Site icon NTV Telugu

Russia School Shooting: రష్యా స్కూల్ కాల్పుల్లో 13 మంది మృతి..

Russia Shooting

Russia Shooting

Russia School Shooting: రష్యాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు స్కూల్ లో విచక్షణారిహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు తనను తాను చంపుకున్నాడు. సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన 13 మందిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ వెల్లడించారు.

Read Also: Rajasthan Political Crisis: కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల చిచ్చు.. హైకమాండ్ ముందు మూడు షరతులు

ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు, ఏడుగురు పిల్లలు మరణించారు. దాడి తరువాత నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ పేర్కొంది. నిందితుడు నాజీల చిహ్నాన్ని, బాలాక్లవాతో నల్లని టాప్ ధరించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి వల్ల ఎలాంటి ఐడీ లేదని అధికారులు చెబుతున్నారు. ఈ దాడిలో మరో 20 మంది గాయపడ్డారని.. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెస్క్యూ, మెడికల్ సిబ్బంది ఘటనాస్థలంలో పనిచేస్తున్నారు. గాయపడిన వ్యక్తులను ఆస్పత్రి తీసుకెళ్లేందుకు వైద్య సిబ్బంది, పోలీసు అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా 6,30,000 మంది ఇజెన్స్క్ నగరంలో నివసిస్తున్నారు. ఇది ఉడ్ముర్ట్ రిపబ్లిక్ ప్రాంతీయ రాజధాని.. ఇది రష్యా రాజధాని మాస్కోకు తూర్పున 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధ సమయంలో ఇలాంటి ఘటన జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2021 మేలో కాజన్ నగరంలో ఇలాగే ఓ వ్యక్తి ఏడుగురు చిన్నారులను, ఇద్దరు వ్యక్తులను కాల్చిచంపాడు. ఆ తరువాత ఇప్పుడే రష్యాలో కాల్పుల ఘటన జరిగింది.

Exit mobile version