NTV Telugu Site icon

India-Russia: భారత్‌కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..

Putin, Modi

Putin, Modi

Russia Announces Deal To Boost Oil Supplies To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలును నిలిపివేశాయి. అయితే రష్యా తన మిత్రదేశాలు అయిన ఇండియా, చైనాకు క్రూడ్ ఆయిల్ ను అత్యంత చౌకగా అందిస్తోంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు భారత్ పై ఒత్తిడి చేస్తున్నా మోదీ ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోంది. మా ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడ కొనుగోలు చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు భారత్ తన వైఖరిని ప్రకటించింది.

Read Also: Smoking Break : 14 ఏళ్లలో 4,500 సార్లకు పైగా స్మోకింగ్ బ్రేక్..

తాజాగా రష్యా ఇంధన దిగ్గజం రోస్ నెప్ట్ భారత్ కు మరింతగా చమురు సరఫరాను చేయడానికి ఒప్పందం కుదర్చుకుంది. రోస్ నెఫ్ట్ సీఈఓ ఇగోర్ సెచిన్ భారత్ కు వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో చర్చలు జరిగి బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రోస్ నెప్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. రోస్ నెప్ట్ ఆయిల్ కంపెనీ నుంచి భారత్ కు గణనీయంగా చమురు ఎగుమతి చేసేలా ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో ఎంత మేర భారత్ కు చమురు సరఫరా అవుతుందనే వివరాలను ప్రకటించలేదు.

ఇటీవల భారత్ కు రష్యా నుంచి చమురు ఎగుమతులు 22 శాతం పెరిగినట్లు రష్యా ఉపప్రధాని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడించారు. భారత్, రష్యా చమురు కంపెనీలు తమ సొంతదేశాల కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే అవకాశాలు ఉన్నాయి. రష్యా తన ఆర్థిక వ్యవస్థను డీ-డాలరైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు రోస్ నెప్ట్ తెలిపింది. రష్యా, పాశ్చాత్య ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నెలలో ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 500,000 బ్యారెల్స్ తగ్గించింది.