CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం కోసం ఇప్పటికే రూల్స్ రెడీ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే సీసీఏ కోసం నిబంధనలు జారీ చేయబోతున్నామని, నిబంధనల జారీ తర్వాత చట్టం అమలు చేయబడుతుందని, అర్హులైన వారికి భారత పౌరసత్వం మంజూరు చేయబడుతుందని విషయం తెలిసిన ఓ అధికారి తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ప్రకటన ముందే చట్టానికి సంబంధించిన నిబంధనల్ని నోటిఫై చేస్తారని తెలుస్తోంది. ‘‘నిబంధనలు సిద్ధంగా ఉన్నాయి. ఆన్‌లైన్ పోర్టల్ కూడా అమలులో ఉంది. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారానే ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వ్యక్తి ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన సంవత్సరాన్ని ప్రకటించాలి. దరఖాస్తుదారుడి దగ్గర నుంచి ఎటువంటి ప్రతం కోరబడదు’’ అని సదరు అధికారి వెల్లడించారు.
Read Also: Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి, 25 మందికి గాయాలు..
పౌరసత్వ సవరణ చట్టం, డిసెంబర్ 31, 2014 వరకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లు, హింసించబడిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ చట్టంలో ముస్లిం వలసదారులను మినహాయించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ చట్టం వివక్షాపూరితంగా ఉందని వివాదాలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. సీఏఏని ఎవరు అడ్డుకోలేరని ప్రకటించారు.