దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్దోత్సవాల ప్రణాళికలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే సామాజిక సమరసతపై ‘పంచ్ పరివర్తన్’ దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా మార్గదర్శకాలు చేయనున్నారు. ఇక ముంబై, బెంగుళూరు, కోల్‌కతా తదితర నగరాల్లో ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిన్నంటితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఆర్ఎస్ఎస్ సమావేశంలో చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Prabhas : ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం.. ఫేక్ వార్తలపై క్లారిటీ ఇదే
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవి కాలం ముగిసింది. కొత్త అధ్యక్ష పదవి ఈసారి మహిళకు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. ఈ దిశగా బీజేపీ హైకమాండ్ కూడా అడుగులు వేస్తోంది. అయితే ఈ రేసులో ప్రధానంగా నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమెకు దేశ వ్యాప్తంగా మంచి పలుకుబడి ఉంది. అంతేకాకుండా నాయకులందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే భాషలపై మంచి పట్టు ఉంది. ఇక రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి సేవలందించారు. అంతేకాకుండా త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ప్రాంత వాసిగా ఈ అంశం పార్టీకి కలిసి వస్తుందని భావిస్తోంది. అంతేకాకుండా దక్షిణాదిలో కూడా పార్టీ బలపడాలంటే.. సౌతిండియా మహిళకే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తోంది. ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మోడీ సర్కార్.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి మహిళలకే ఇస్తేనే బాగుంటుందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మేథోమథనం చేస్తున్నాయి. ఒక నిర్మలా సీతారామన్ కాకపోతే మాత్రం రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి అవకాశం దక్కే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: Bride Leaves with Boyfriend: ఉదయం పెళ్లి.. మధ్యాహ్నం ప్రియుడితో పెళ్లి కూతురు జంప్..! బతికిపోయాడా..?
