NTV Telugu Site icon

RSS: “నో డ్రోన్” జోన్‌గా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం..

Rss

Rss

RSS: బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని ‘ నో డ్రోన్’ జోన్‌గా ప్రకటించారు. అనేక ఉగ్రసంస్థలతో పాటు సంఘవ్యతిరేక శక్తులకు ఆర్ఎస్ఎస్ ప్రధాన టార్గెట్‌గా ఉండటంతో నాగ్‌పూర్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 (1) (3) కింద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Ayodhya Ram Mandir: 2500 ఏళ్లలో ఒకసారి వచ్చే భారీ భూకంపాన్ని రామ మందిరం తట్టుకుంటుంది..

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం హోటళ్లు, లాడ్జీలు, కోచింగ్ సెంటర్లతో ఉన్న జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉందని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతీ డోర్జే తెలిపారు. మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలోని మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని “నో-డ్రోన్” జోన్‌గా ప్రకటించారు, ముప్పు పొంచి ఉన్నందున మార్చి 28 వరకు ప్రాంగణంలోని ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధించారు. ఈ ఏడాది జనవరి 29 నుంచి మార్చి 28 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు.