Site icon NTV Telugu

RSS General Secretary: టూరిస్టులపై ఉగ్రదాడి.. పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలి..!

Rss

Rss

RSS General Secretary: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జనరల్‌ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన హృదయాన్ని కలిచి వేసిందన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, మేము నివాళులు అర్పిస్తున్నాం.. గాయపడిన పర్యాటకులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. మన దేశ ఐక్యత, సమగ్రతపై జరిగిన దాడి ఇది.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఈ ఉగ్రదాడిని ఖండించాలి అని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు.

Read Also: Pahalgam Attack: పాతికేళ్ల క్రితం క్లింటన్.. ఇప్పుడు జేడీ వాన్స్: విదేశీ అతిథులు ఉన్నప్పుడే ఉగ్రదాడులు..!

అయితే, బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత‍్వం అవసరమైన సహాయాన్ని అందించాలి అని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రెటరీ హోసబలే కోరారు. ఇక, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం కృషి చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ దాడులకు పాల్పడిన వారిని ఎవరినీ కూడా వదిలి పెట్టే ప్రసక్తి లేదు అన్నారు. చెసిన తప్పుకు నిందితులు శిక్ష అనుభవించి తీరాలని దత్తాత్రేయ హోసబలె పేర్కొన్నారు.

Exit mobile version