అవసరమైన చోట భారతదేశం తన బలాన్ని ప్రదర్శిస్తుందని.. అందుకే ప్రధాని మోడీ మాటను ప్రపంచ నాయకులు జాగ్రత్తగా వింటారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలను పురస్కరించుకుని సోమవారం పూణెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Lok sabha: ‘సర్’పై పట్టువీడని విపక్షాలు.. పార్లమెంట్ భవన్ ఎదుట ఆందోళన
జయంతి లేదా శతాబ్ది ఉత్సవాలు వంటి జరుపుకోవడానికి ఎదురుచూడకూడదని.. ఇచ్చిన పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. సంఘ్ అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందని.. అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడిందని గుర్తుచేశారు. మొత్తం సమాజాన్ని ఏకం చేసేందుకు ఎందుకు ఇంత సమయం పట్టిందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh-IAS Trainees: ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రాజ్‌నాథ్‌సింగ్‌కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే..!
భారతదేశం ఎదిగినప్పుడే ప్రపంచ సమస్యలు పరిష్కారం అవుతాయని.. అంతేకాకుండా సంఘర్షణలు.. శాంతి నెలకొంటుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ పునాదే ఐక్యతతో కూడి ఉందన్నారు. అందుకోసం కలిసి నడవాలని.. దీనికి ధర్మం చాలా అవసరం అని సూచించారు. భారతదేశంలో అన్ని తత్వాలు ఒకే మూలం నుంచి ఉద్భవించాయని.. ప్రతీది ఒకదానితో ఒకటి అనుసంధానించబడినందున.. మనమంతా సామరస్యంగా ముందుకు సాగాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.
