Site icon NTV Telugu

Lottery Ticket: అన్నదాతకు జాక్‌పాట్.. రూ.7 లాటరీ టికెట్‌తో రూ.కోటి గెలుపు

Lottery Ticket3

Lottery Ticket3

చాలా మంది సుడి తిరగాలంటే లాటరీ అన్నా గెలవాలి.. లేదంటే అదృష్టమైనా కలిసి రావాలని అప్పుడప్పుడు అంటుంటారు. ఇలాంటి మాటలు సరదానే మాట్లాడుకున్నా.. ఇది అక్షరాల రుజువైంది. ఓ అన్నదాతను అదృష్టం తలుపు తట్టింది. రూపాయి కాదు.. లక్ష కాదు.. ఏకంగా ఒకేసారి కోటి రూపాయుల బహుమతి గెలుచుకున్నాడు. అతని ఆనందానికి అవధులే లేవు. ఇది ఎక్కడ జరిగింది. ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ నివాసి అయిన బల్కార్ సింగ్.. సిర్హింద్‌లోని బిట్టు లాటరీ స్టాల్ నుంచి రూ.7 లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 10 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. కానీ ఏ రోజూ కూడా లాటరీ గెలవలేదు. ఇప్పటికే వందలాది లాటరీ టికెట్లు కొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా కొనుగోలు చేసిన టికెట్‌ను కూడా అలానే భావించాడు. కానీ డిసెంబర్ 29న రూ.కోటి లాటరీ గెలిచినట్లుగా బల్కార్ సింగ్‌కు నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అతడు ఎగిరి గంతులేశాడు. మొత్తానికి 2025 సంవత్సరం చివరిలో అదృష్టం కలిసొచ్చింది.

లాటరీ గెలిచిన వార్త తెలియగానే బల్కార్ సింగ్.. మజ్రి సోధియాన్ గ్రామంలో నృత్యం చేస్తూ గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు పూల దండలతో సత్కరించారు. దేవుని ఆశీర్వాదంతో లాటరీ గెలుచుకున్నట్లుగా అన్నదాత తెలిపాడు. 90 శాతం డబ్బును వ్యవసాయ పనులకు ఉపయోగిస్తానని.. మిగతా 10 శాతం సహాయం చేయడానికి ఖర్చు చేస్తానని వెల్లడించాడు.

ఇక లాటరీ స్టాల్ యజమాని ముఖేష్ కుమార్ బిట్టు మాట్లాడుతూ.. తాను 45 సంవత్సరాలుగా లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నానని.. తన స్టాల్ గతంలో రూ. 10 లక్షల వరకు బహుమతులు గెలుచుకున్నప్పటికీ ఇప్పటి వరకు కోటి రూపాయులు గెలుచుకోలేదన్నారు. రూ. 1 కోటి బహుమతిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపాడు. డిసెంబర్ 24న లాటరీ డ్రా తీశామని.. అదే రోజు ఫలితాలు ప్రకటించినట్లు చెప్పాడు. అయితే ఫతేఘర్ సాహిబ్‌లో షహీదీ సమాగం జరుగుతున్నందున వరుసగా మూడు రోజులు లంగర్ సేవలో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఆ సమయంలో వ్యాపారం మూసేశామని.. వెంటనే రైతుకు సమాచారం అందించలేదన్నారు. కొన్ని రోజుల తర్వాతే బల్కార్ సింగ్‌కు సమాచారం అందించినట్లు తెలిపాడు.

Exit mobile version