NTV Telugu Site icon

Salman Khan: సల్మాన్ ఖాన్‌ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్.. పాక్ నుంచి ఏకే-47..

Lawrence Bishnoi

Lawrence Bishnoi

Salman Khan: మహారాష్ట్రలోని పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లో అతడిని హత్య చేసేందుకు రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవీ ముంబై పోలీసులు గురువారం దాఖలు చేసిన ఛార్జిషీట్ పేర్కొంది. ఐదుగురు వ్యక్తులు, జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ముఠా ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నట్లు వెల్లడించింది. నిందితులు పాకిస్తాన్ నుంచి అత్యాధునియ ఆయుధాలైన ఏకే-47, ఏకే-92, ఏమ్-16 వంటి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు పంజాబీ సింగర్ సిద్దూమూసేవాలాను చంపేందుకు వాడిన జిగానా అనే ఆయుధాన్ని కూడా కొనాలనుకున్నారని ఛార్జిషీట్ పేర్కొంది.

నిందితులు సల్మాన్ ఖాన్‌ని హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు అబ్బాయిలను నియమించుకున్నారని, వీరింతా పూణే, రాయ్‌గఢ్, నవీ ముంబై, థానే, గుజరాత్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిపింది. దాదాపుగా 60-70 మంది సల్మాన్ ఖాన్ కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా ఇంటిని, పన్వెల్‌లోని ఫామ్‌హౌజ్‌ని, గోరేగావ్ లోని సల్మాన్ ఖాన్‌ని ట్రాక్ చేసినట్లు ఛార్జిషీట్ పేర్కొంది. సల్మాన్‌ఖాన్‌ని చంపడానికి ఆగస్టు 2023- ఏప్రిల్ 2024 మధ్య ప్లాన్ జరిగింది.

Read Also: Rajnikanth : “వెట్టయన్ ది హంటర్”కి ప్రీక్వెల్‌ చేయాలని ఉంది : టి.జె. జ్ఞానవేల్

గురువారం హర్యానాలోని పానిపట్‌లో అరెస్ట్ అయిన సుఖా, కుట్రలో పాల్గొన్న షూటర్ అజయ్ కశ్యప్ అలియాస్ ఏకేతో పాటు మరో నలుగురికి హత్యను కేటాయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ ఖాన్‌కి గట్టి భద్రత, బుల్లెట్ ఫ్రూవ్ వాహనం కారణంగా హత్యకు అత్యాధునిక ఆయుధాలు అవసరమవుతాయని కశ్యప్, అతని టీం ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో సుఖా ఆయుధాల కోసం పాకిస్తాన్‌కి చెందిన ఆయుధ వ్యాపారి డోగర్‌ని సంప్రదించాడు. డోగర్ ఆయుధాలను సరఫరా చేయడానికి అంగీకరించగా, సుఖా 50 శాతం అడ్వాన్ ఇచ్చి, మిగతాది భారతదేశంలో డెలవరీ చేయడానికి అంగీకరించాడు.

షూటర్లు అంతా కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తు్న్నారని పోలీసులు కనుగొన్నారు. సల్మాన్ ఖాన్‌ని చంపేసిన తర్వాత నిందితులంతా కన్యాకుమారి వెళ్లి, అక్కడ నుంచి శ్రీలంకకు అక్కడ నుంచి భారతీయ నిఘా సంస్థలు చేరలేని దేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని ఛార్జిషీట్ పేర్కొంది. బాంద్రాలో సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగిన తర్వాత, పన్వెల్ ఘటన వెలుగులోకి వచ్చింది.