Site icon NTV Telugu

Pahalgam terror attack: ఉగ్రవాదుల జాడ చెప్పిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతి..

Terrorist

Terrorist

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాది యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది అమాయకపు టూరిస్టులు ప్రాణాలు వదిలారు. నలుగురి నుంచి 6 మంది వరకు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురిని భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిని సులేమాన్ షా, అబు తల్హా, ఆసిఫ్ ఫౌజీలుగా గుర్తించారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా లష్కరే తోయిబా అగ్ర కమాండర్ సైఫుల్లా సాజిద్ భట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులకు స్థానికంగా ఇద్దరు సహకరించినట్లు తెలుస్తోంది.

Read Also: Danish Kaneria: ‘‘తప్పు చేయకుంటే, పాక్ ఆర్మీ ఎందుకు అప్రమత్తమైంది’’.. మాజీ క్రికెటర్ కనేరియా ఫైర్..

అయితే, ఈ ఉగ్రవాదుల సమాచారం చెప్పిన వారికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ‘‘ఈ పిరికిపంద దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి దారితీసే సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతిని ఇస్తాం’’ అని అనంత్ నాగ్ పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.

Exit mobile version