NTV Telugu Site icon

RRB Exams: అభ్యర్థులకు అలర్ట్.. ఆర్ఆర్‌బీ గ్రూప్-D రాతపరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Rrb Exams

Rrb Exams

RRB Exams: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్-D రాత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.RRB గ్రూప్ D ఫేజ్ 1 పరీక్షలు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు జరుగుతాయి. మొత్తం 1,03,769 లక్షల ఉద్యోగాలకు 1.15 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల్లో జనరల్ కేటగిరీకి 42,355, షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి 15,559, షెడ్యూల్డ్ తెగలకు 7,984, ఇతర వెనుకబడిన తరగతులకు 27,378, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10,381 ఉన్నాయి.

Read Also: National Flag Honors: దెబ్బతిన్న జాతీయ జెండాను ఎలా గౌరవంగా పారేయాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ఈ సందర్భంగా పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయంలో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఉంటుంది. 100 మార్కులకు పేపర్ ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. ఈ పరీక్ష 90 నిమిషాలు జరగనుంది. జనరల్ సైన్స్ 25, మ్యాథ్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 40 శాతం, ఓబీసీకి 30, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.