Site icon NTV Telugu

Punjab: పంజాబ్‌ పాటియాలాలో పట్టుబడిన రాకెట్ మందుగుండు సామాగ్రి..

Rocket Ammunition Seized

Rocket Ammunition Seized

Punjab: పంజాబ్ పాటియాలాలో నిర్వహించిన సోదాల్లో రాకెట్ మందుగుండు సామాగ్రి దొరికింది. పేలుడు పదార్థాలు దొరకడంతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళన వ్యక్తమైంది. అనుమానాస్పద పదార్థాల గురించి పోలీసులకు సమాచారం అందడంతో, పాటియాలాలోని రాజ్‌పురా రోడ్డులోని చెత్త కుప్పలో సోదాలు జరిపారు. దీంట్లో మందుగుండు సామాగ్రి దొరికినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Read Also: CISF Recruitment 2025: 10th పాసైతే చాలు.. సీఐఎస్ఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ. 69 వేల జీతం

డిసెంబర్ 2022లో, మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన 7 నెలల తర్వాత పాటియాలకు 200 కి.మీ దూరంలోని తరణ్ తరణ్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ వద్ద ఆర్పీజీ దాడి జరిగింది. పంజాబ్‌లో ఖలిస్తానీ వేర్పాటువాదంతో పాటు గ్యాంగ్‌స్టర్స్, అక్రమ మాదకద్రవ్యాల సరఫరా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పేలుడు పదార్థాలు లభించడం సంచలనంగా మారింది.

Exit mobile version