NTV Telugu Site icon

Robert Vadra: ఢిల్లీ ఫలితాలపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

Robertvadra

Robertvadra

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వ్యాపారవేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్లే ఆప్ ఓడిపోయిందని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. ఓట్లు శాతాన్ని చూస్తే.. చాలా చోట్ల కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో తీవ్ర మార్పు కోరుకున్నారని అర్థమవుతుందన్నారు. బీజేపీతో పోరాడాలంటే ఇండియా కూటమితో కలిసి ఉంటూనే సాధ్యమవుతుందని రాబర్ట్ వాద్రా హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. విభేదాలను పక్కన పెట్టి ఇండియా కూటమి కలిసి ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Sahu Garapati: అడల్ట్ కామెడీనే కానీ ఫన్ రైడ్..హాయిగా నవ్వుకొవాలనే చేసిన సినిమా: నిర్మాత సాహు ఇంటర్వ్యూ

కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. వాటిని నిలబెట్టుకోలేదని.. అందుకే ఢిల్లీ ప్రజలు ఓడించారని తెలిపారు. కేజ్రీవాల్ తన పునాదిని మరిచిపోయారు. తాను గాంధీ కుటుంబంలో ఒకడిని.. అయినా కూడా తనపై ఆరోపణలు చేశారని.. తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని రాబర్ట్ వాద్రా చెప్పారు. ఇక ప్రియాంకాగాంధీ కూడా ఫలితాలపై స్పందిస్తూ.. ప్రజలు మార్పు కోరుకున్నారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక కాంగ్రెస్ అయితే జీరో సీట్లు సాధించింది. 27 ఏళ్ల తర్వాత తిరిగి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

ఇది కూడా చదవండి: TG: టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే..?