NTV Telugu Site icon

Robert Vadra: కేజ్రీవాల్ అవకాశవాది.. కాంగ్రెస్, ఆప్ నేతలపై సంచలన వ్యాఖ్యలు..

Robert Vadra

Robert Vadra

Robert Vadra: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సొంత పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని ఆయన ‘‘ అవకాశవాది’’గా పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా అని ప్రశ్నించిన సమయంలో ఇది తన సొంత అభిప్రాయమని వెల్లడించారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి.

Read Also: Expired Food : రూ.70,000 విలువైన కాలం చెల్లిన ఆహార పదార్థాలు లభ్యం

కేజ్రీవాల్‌పైనే కాకుండా కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్‌ని ‘‘లౌడ్ మౌత్’’ అని విమర్శించారు. సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ని ‘‘అనుభవం లేనివాడు’’ అని కూడా పిలిచారు. ఇటీవల భారతీయులను ఉద్దేశించి మాజీ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యలపై ‘‘ రిటైర్డ్ వ్యక్తి పదవీ విరమణ చేయాలి’’ అని అన్నారు.

ఇటీవల పిట్రోడా మాట్లాడుతూ..‘‘ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి భారత్ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు. పశ్చిమంలో ఉన్నవారు అరబ్‌లా కనిపిస్తారు. ఉత్తరాది ప్రజలు బ్రిటీష్ వారిలా, దక్షిణ భారత దేశ ప్రజలు ఆఫ్రికన్లుగా ఉంటారు’’ అని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో రాబర్ట్ వాద్రా రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి చూపించారు, కానీ చివరకు ఏ స్థానం నుంచి కూడా పోటీలోకి దిగలేదు.