Site icon NTV Telugu

Robert Vadra: ఈడీ ప్రశ్నలపై రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

Robertvadra

Robertvadra

మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంకతో కలిసి విచారణ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు కొత్త ప్రశ్నలేవీ అడగడం లేదని చెప్పారు. అడిగినవే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2019లో కూడా ఇవే ప్రశ్నలు అప్పుడు అడిగారని తెలిపారు. కొత్త సంగతి ఏమీ లేదన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయినా కూడా తట్టుకునే శక్తి తమకు ఉందన్నారు. ఈడీ చర్య తమ కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Abhinaya : ముడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అభిన‌య..కార్తీక్

రెండు రోజుల విచారణలో పది గంటల పాటు విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఇక బుధవారం విచారణ ముగిసిన అనంతరం రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంలో భాగంగా కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. అదే బీజేపీలో చేరుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: TTD Gosala: ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు.. భూమనకు ఫోన్‌ చేసిన కూటమి ఎమ్మెల్యేలు!

 

 

Exit mobile version