బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వే దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. బీహార్ అసెంబ్లీలోనూ విపక్షాలు తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం కేవలం అధికారి పార్టీకి అనుకూలంగా పని చేస్తోందని.. ఆ కారణంతోనే 65 లక్షల ఓట్లు తొలగించిందంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Congress vs BJP: ఇటలీ పౌరురాలికి ఓటు ఎలా వచ్చింది.. సోనియాగాంధీపై బీజేపీ ఎదురుదాడి
తాజాగా ఇదే అంశంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. బీహార్ ఓటర్ జాబితాలో గుజరాత్ వ్యక్తులు ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారు. గుజరాత్‌కు చెందిన కొందరు వ్యక్తులు బీహార్‌లో ఓటు హక్కు పొందారని ఆరోపించారు. బీజేపీ ఇంఛార్జ్ భిఖుభాయ్ దల్సానియా పాట్నా ఓటర్‌గా మారారని.. ఇదిలా సాధ్యమైందని ప్రశ్నించారు. 2024లో ఆయన గుజరాత్‌లో ఓటువేశారని.. కానీ ఇప్పుడు తాజాగా బీహార్‌లో ఓటు ఉందన్నారు. బీహార్‌లో మళ్లీ ఎలక్షన్ ముగియగానే.. మళ్లీ గుజరాత్ వెళ్లిపోతారన్నారు. ఇదంతా కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌తో కలిసి బీజేపీ మోసం చేస్తోందని తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: BR Gavai: వీధి కుక్కల తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక ప్రకటన
ప్రస్తుతం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్నికల సంఘం చేపట్టిన సర్వేపై విశ్వాసం కోల్పోవడమే అసలు సమస్య అని.. అంతకుమించి ఏమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి న్యాయస్థానం సూచించింది.
