బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అనుమానంగా ఉందని.. చాలా వింతగా ప్రవర్తిస్తున్నారంటూ ఒక వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలాంటి దయనీయ స్థితిలో చూడటం మీకెలా అనిపిప్తోంది? వింతగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి మీకు మానసికంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే ఈ పరిస్థితిని సృష్టించారా? లేదా? బీహారీలు ఈ సత్యాన్ని గ్రహించాలని తేజస్వి యాదవ్ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: సింధీ క్యాంప్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కౌశల్ దీక్షాత్ సమరోహ్ 2025 సందర్భంగా వీడియోను చిత్రీకరించారు. దేశవ్యాప్తంగా ఐటీఐ టాపర్ల కోసం జరిగిన నైపుణ్య స్నాతకోత్సవ కార్యక్రమానికి నితీష్ కుమార్ వర్చువల్‌గా హాజరైనట్లు కనిపించింది. ఇందులో నమస్తే పెడుతున్న సంజ్ఞలో అరచేతులు జోడిస్తూ పదే పదే కనిపించారు. వీడియో కాన్ఫరెన్సింగ్‌లో విద్యార్థులను ప్రశంసిస్తున్నట్లు కనిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువ విజేతలకు సర్టిఫికెట్లను అందజేశారు.
ఇది కూడా చదవండి: Gurugram: గురుగ్రామ్‌లో దారుణం.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్‌రేప్
‘‘ముఖ్యమంత్రి ప్రవర్తనలో ఇంకేమైనా తేడా ఉందా అంటూ ఊహించాలని తేజస్వి యాదవ్ కోరారు. లేదంటే ఇదేమైనా కుట్రనా? బీజేపీ ఉద్దేశపూర్వకంగా దీన్ని సృష్టించిందా? ఊహించాలని విజ్ఞప్తి చేశారు. బీహార్‌లోని మెజారిటీ ప్రజలు నిజం తెలుసుకోవాల్సిన అవసరం లేదా?” అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు.
एक प्रदेश के मुख्यमंत्री को इस दयनीय स्थिति में देख आपको कैसा लग रहा है? क्या अजीब हरकते करते मा॰ मुख्यमंत्री जी आपको मानसिक रूप से स्वस्थ दिखाई दे रहे है?
क्या साजिशन इनकी ऐसी हालत बीजेपी के इशारे पर इनकी ख़ास भूंजा पार्टी ने प्रसाद या अन्य खाद्य पदार्थ खिलाने के बहाने की है?… pic.twitter.com/1JhRwi8DoR
— Tejashwi Yadav (@yadavtejashwi) October 5, 2025
