Site icon NTV Telugu

Abdul Siddiqui: భారతదేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.

Rjd Leader

Rjd Leader

RJD leader Abdul Siddiqui on Muslims feeling insecure in India: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. బీహార్ మాజీ మంత్రి అయిన సిద్ధిఖీ.. తన కొడుకు, కూతుర్లకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని, వీలైతే అక్కడే పౌరసత్వం కూడా ఇప్పించాలని కోరానని సిద్ధిఖీ అన్నారు.

గత వారం బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జేడీ నేత మాట్లాడుతూ.. నా కుమారుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడని.. నా కూతురు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పట్టా పొందిందని అన్నారు. అయితే వీళ్లిద్దరికి అక్కడే ఉద్యోగం చేయాలని.. వీలయితే అక్కడే పౌరసత్వం పొందాలని చెప్పానని అన్నారు.

భారతదేశంలో ఉన్న వాతావరణాన్ని భరించగలరో లేదో నాకు తెలియదని వారికి చెప్పానని అబ్దుల్ బారీ సిద్ధికీ అన్నారు. ఒక మనిషి తన పిల్లలను మాతృభూమిని విడిచిపెట్టమని చెప్పడం ఎంత బాధకరమో మీరు అర్థం చేసుకోవచ్చంటూ.. కానీ అలాంటి సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 17న బీహార్ కౌన్సిల్ చైర్మన్ దేవేష్ చంద్ర ఠాకూర్‌ను సన్మానించేందుకు దైనిక్ ప్యారీ ఉర్దూ నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధిఖీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version