NTV Telugu Site icon

Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..

Canada

Canada

Canada: గుప్పెడు ఖలిస్తానీ వేర్పాటువాదుల ఓట్లను పొందేందుకు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చేయని పని లేదు. ఉగ్రవాదిగా ముద్రపడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించిన ఏడాది తర్వాత అక్కడి పార్లమెంట్‌లో నివాళులు అర్పించింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా గత కొంత కాలంగా ఖలిస్తానీలకు మద్దతుపలుకుతూ, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే కెనడా డిప్యూటీ ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ నిజ్జర్‌కి పార్లమెంట్ నివాళులు అర్పించడాన్ని సమర్థించుకుంది. ప్రధాని ట్రూడో చర్యను ప్రశంసించింది.

Read Also: Kalki 2898 AD : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సెట్ చేస్తున్న ప్రభాస్..

నో ఫ్లై లిస్టులో ఉండీ, మరణానికి ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపబడిన ఖలిస్తానీ వేర్పాటువారి హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి ఇప్పుడు ఎందుకు నివాళులు అర్పిస్తున్నారని కెనడా ఉపప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్‌‌ని విలేకరులు ప్రశ్నించిన సందర్భంలో ఆమె తడబడ్డారు. ఈ చర్యలను సమర్థించుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కెనడియన్‌ని కెనడా గడ్డపై హత్య చేయడాన్ని ఖండిస్తూ పార్లమెంట్‌లో నివాళులు అర్పించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. హత్య తర్వాత ప్రధాని ట్రూడో తీసుకున్న నిర్ణయంపై గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇది సరైన పని, కానీ అంత తేలికైన పని కాదని అన్నారు.

అయితే, నో ఫ్లై లిస్టు, బ్యాంకు ఖాతాలు స్తంభించబడిన వ్యక్తికి హఠాత్తుగా ఇప్పుడే నివాళులు ఎందుకు అర్పించారు..? అనే దానిపై మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. భారతదేశంలోని పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో జన్మించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ 1997లో కెనడాకు వలస వెళ్లి బ్రిటిష్ కొలంబియాలో ప్లంబర్‌గా పనిచేశాడు. భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేత ఖలిస్తానీ ఉగ్రవాదిగా ప్రకటించబడిన నిజ్జర్‌ను గత ఏడాది జూన్ 18న గుర్తు తెలియని దుండగులు సర్రే గురుద్వారా వెలుపల కాల్చి చంపారు.