Canada: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళి ఎందుకు..? తడబడిన కెనడా ఉప ప్రధాని..
- పార్లమెంట్‌లో నిజ్జర్‌కి నివాళి ఎందుకు..?
- ఖలిస్తానీ వేర్పాటువాదికి నివాళిపై ప్రశ్న..
- సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్న కెనడా ఉప ప్రధాని..
- ఈ చర్యకు ట్రూడోని ప్రశంసించిన డిప్యూటీ పీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: గుప్పెడు ఖలిస్తానీ వేర్పాటువాదుల ఓట్లను పొందేందుకు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చేయని పని లేదు. ఉగ్రవాదిగా ముద్రపడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించిన ఏడాది తర్వాత అక్కడి పార్లమెంట్‌లో నివాళులు అర్పించింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా గత కొంత కాలంగా ఖలిస్తానీలకు మద్దతుపలుకుతూ, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే కెనడా డిప్యూటీ ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ నిజ్జర్‌కి పార్లమెంట్ నివాళులు అర్పించడాన్ని సమర్థించుకుంది. ప్రధాని ట్రూడో చర్యను ప్రశంసించింది.
Read Also: Kalki 2898 AD : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సెట్ చేస్తున్న ప్రభాస్..
Also Read
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
నో ఫ్లై లిస్టులో ఉండీ, మరణానికి ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపబడిన ఖలిస్తానీ వేర్పాటువారి హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి ఇప్పుడు ఎందుకు నివాళులు అర్పిస్తున్నారని కెనడా ఉపప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్‌ని విలేకరులు ప్రశ్నించిన సందర్భంలో ఆమె తడబడ్డారు. ఈ చర్యలను సమర్థించుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కెనడియన్‌ని కెనడా గడ్డపై హత్య చేయడాన్ని ఖండిస్తూ పార్లమెంట్‌లో నివాళులు అర్పించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. హత్య తర్వాత ప్రధాని ట్రూడో తీసుకున్న నిర్ణయంపై గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇది సరైన పని, కానీ అంత తేలికైన పని కాదని అన్నారు.
అయితే, నో ఫ్లై లిస్టు, బ్యాంకు ఖాతాలు స్తంభించబడిన వ్యక్తికి హఠాత్తుగా ఇప్పుడే నివాళులు ఎందుకు అర్పించారు..? అనే దానిపై మాత్రం నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. భారతదేశంలోని పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో జన్మించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ 1997లో కెనడాకు వలస వెళ్లి బ్రిటిష్ కొలంబియాలో ప్లంబర్‌గా పనిచేశాడు. భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేత ఖలిస్తానీ ఉగ్రవాదిగా ప్రకటించబడిన నిజ్జర్‌ను గత ఏడాది జూన్ 18న గుర్తు తెలియని దుండగులు సర్రే గురుద్వారా వెలుపల కాల్చి చంపారు.
Chrystia Freeland @cafreeland is stumped with this question asking why Hardeep Singh Nijjar who, before his death was on the no-fly list and his bank accounts were frozen, now after his death he is being given tribute in the parliament….what exactly changed?
Listen to her… pic.twitter.com/fO8KcfGBki
— Journalist V (@OnTheNewsBeat) June 21, 2024
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!