NTV Telugu Site icon

Kolkata Doctor Case: నిందితుడు సంజయ్‌రాయ్ తరలింపులో పోలీసులు కొత్త ట్రిక్!

Kolkatadoctorcase

Kolkatadoctorcase

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌ను తరలించే సమయంలో పోలీసులు వింతగా వ్యవహరించారు. అతడి అరుపులు వినపడకుండా ఏకధాటిగా హారన్లు మోగిస్తూ ఉన్నారు. దీంతో అతడి అరుపులు వినపడకుండా పోయాయి. విచారణ నిమిత్తం జైల్లో ఉన్న నిందితుడు సంజయ్‌ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు సోమవారం సీల్దా కోర్టుకు తరలించారు. ఆ సమయంలో సంజయ్‌ రాయ్‌ మీడియాకు, ప్రజలకు అరుపులు వినిపించకుండా పోలీసులు హారన్‌ మోగిస్తూ తీసుకెళ్లడం చర్చనీయాశంగా మారింది.

ఇది కూడా చదవండి: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?

నవంబర్ 11న సీల్దా కోర్టుకు సంజయ్‌రాయ్‌ను తీసుకెళ్లే సమయంలో సంజయ్‌రాయ్ పోలీస్ వాహనం నుంచి అరుస్తూ కనిపించాడు. కోల్‌కతా మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్‌ తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, తాను ఏ తప్పూ చేయలేదని కేకలు వేశారు. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా ఈసారి పోలీసులు హారన్లు మోగిస్తూ ఉన్నారు.

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారిస్తోంది.

ఇది కూడా చదవండి: Jio 5G: అదిరిపోయే ఆఫర్.. రూ.601తో ఏడాదంతా అన్‌లిమిటెడ్‌ డేటా