NTV Telugu Site icon

Kolkata Doctor Case: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. వైద్యురాలి కేసు బదిలీకి నిరాకరణ

Kolkata

Kolkata

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు పశ్చిమ బెంగాల్ కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేసు బదిలీకి న్యాయస్థానం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్‌ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్‌ స్టేట్‌మెంట్‌లు చేయొద్దని హెచ్చరించారు.

‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదిలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమీ లేదు. కావున అటువంటి కేసు బదిలీ చేయలేం. ఇక ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్‌ రిపోర్టును మేం పరిశీలించాం. అయితే సీబీఐ విచారణ సమయంలో మేం కేసు స్టేటస్‌ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వాత అప్‌డేట్‌ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: MP Laxman: దేశ అభివృద్ధిలో మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు..

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా అత్యాచారానికి గురైంది. అనంతరం సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. విధులు బహిష్కరించిన నిరసనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత డాక్టర్లు విధుల్లో చేరారు.

ఇది కూడా చదవండి: Parenting Tips : మీ పిల్లలు మాట వినట్లేదా? వారిని కొట్టకుండా మార్చే టిప్స్ ..

Show comments