NTV Telugu Site icon

Amit Shah Video: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు.. అమిత్ షా వీడియోపై విచారణ..

Revanth

Revanth

Amit Shah Video: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకావాలని కోరారు. రిజర్వేషన్ల వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న  రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు డీజీపీ, సీఎస్‌కి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరితో ఈ ఫేక్ వీడియోను వైరల్ చేసిన కాంగ్రెస్ నేతలకు కూడా సమన్లు అందాయి. రేవంత్ రెడ్డి ఉపయోగించిన అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా తీసుకురావాలని ఢిల్లీ పోలీసులు కోరారు.

అమిత్ షాకు సంబంధించిన ఈ ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ షేర్ చేసింది, ఆ తర్వాత చాలా మంది పార్టీ నాయకులు ఈ వీడియోను రీ పోస్ట్ చేశారు. ఎడిట్ ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం కావడంపై బిజెపి మరియు హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదులతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాలను రద్దు చేయాలని అమిత్ షా చెప్పినట్లు మార్ఫింగ్ చేశారు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 153, 153A, 465, 469, 171G మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోను అప్‌లోడ్ చేసిన మరియు షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు ఎక్స్, ఫేస్‌బుక్‌కి నోటీసులు పంపారు. రాజకీయ ర్యాలీలో అమిత్ షా చేసిన అసలు ప్రకటనల్ని వక్రీకరించేందుకు ఈ వీడియోలను తారుమారు చేశారని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ ఎడి చేసిన వీడియోను పూర్తిగా ఫేక్ అని, ఆయన మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం గురించి మాట్లాడారని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా అన్నారు.

Read Also: Amit Shah Video: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు.. అమిత్ షా వీడియోపై విచారణ..

ఎన్నికల వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా కొన్ని ఫేక్ వీడియోలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల అస్త్రంగా మల్చుకుని బీజేపీపై విమర్శలు గుపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఈ ఇష్యూపై ఇవాళ (సోమవారం) ఆయన మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.

కాగా, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హెచ్చరికలు జారీ చేశారు. ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భారతీయ జనతా పార్టీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.