Site icon NTV Telugu

ICMR: చక్కెర, ఉప్పును పరిమితం చేసి, ప్రొటీన్ సప్లిమెంట్లను నివారించండి.. కొత్త ఆరోగ్య మార్గదర్శకాలు..

Sugar Intake

Sugar Intake

ICMR: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బుధవారం దేశంలోని ప్రజల కొసం ఆహార మార్గదర్శాలకు విడుదల చేసింది. దేశంలో అవసరమైన పోషకాల అవసరాలను తీర్చడానికి, అసంక్రమిత వ్యాధుల్ని నివారించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. భారదేశంలోని మొత్తం వ్యాధుల్లో 56.4 శాతం అనారోగ్యపు ఆహారపు అలవాట్లే కారణం అవుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు కీలకంగా మారనున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) 13 ఏళ్ల తర్వాత మార్గదర్శకాలను సవరించింది.

ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కరోనరీ హార్ట్ డీసజ్(CHD) మరియు హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)ని తగ్గిండచమే కాకుండా, టైప్-2 డయాబెటిస్‌ని 80 శాతం వరకు నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల అకాల మరణాలను గణనీయంగా నివారించవచ్చని పేర్కొంది. 148 పేజీల నివేదిక, 17 మార్గదర్శకాలను కలిగి ఉంది. వంటనూనెల వినియోగాన్ని తగ్గించి, బదులుగా గింజలు, నూనె గింజలు, సముద్ర ఆహారం ద్వారా ఫ్యాటీ యాసిడ్స్ పొందాలని సిఫారసు చేసింది.

READ ALSO: Oleander Flowers: “ఒలియాండర్ పూలు” కేరళ ఆలయాల్లో నిషేధం.. కారణం ఏంటంటే..?

చక్కెరలు, కొవ్వులు కలిగిన ప్రాసెస్ చేయబడిన ఆహారాల అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, విభిన్న ఆహార అలవాట్లు దేశంలో మైక్రోన్యూట్రీషియంట్స్ లోపాలు, అధిక బరువుకు కారణమవుతున్నాయని చెప్పింది. ఉప్పు, నూనె, కొవ్వులను పరిమితంగా తీసుకోవాలని, సరైన వ్యాయామం చేయాలని, చక్కెర, ఆల్ట్రా ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తగ్గించాలని ఇన్‌స్టిట్యూట్ సిఫారసు చేసింది. భారతీయులు రోజుకు 20-25 గ్రాములు చక్కెర తినాలని, ఇది సహజ కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుందని పేర్కొంది.

ICMR-NIN డైరెక్టర్ డాక్టర్ హేమలత ఆర్ నేతృత్వంలో భారతీయుల కోసం రూపొందించిన ఆహార మార్గదర్శకాలు అనేక శాస్త్రీయ సమీక్షలకు లోనయ్యాయి. బాడీ బిల్డింగ్, బాడీ మాస్ నిర్మించడానికి ‘ప్రోటీన్ సప్లిమెంట్’లను నివారించడాలని ఎన్ఐఎన్ ప్రజల్ని కోరింది. ప్రోటీన్ పౌడర్‌లను ఎక్కువ కాలం తీసుకోవడం లేదా అధిక గాఢత తీసుకోవడం వల్ల ‘బోన్ మినరల్ లాస్’కి కారణం అవ్వడమే కాకుండా కిడ్నీ డ్యామేజ్‌ వంటి ప్రమాదాలు ముడిపడి ఉన్నట్లు పేర్కొంది.

మొత్తం శరీర ఎనర్జీలో చక్కెర శాతం 5 కన్నా తక్కువగా ఉండాలని, సమతుల్య ఆహారంలో తృణధాన్యాలు, మిలెట్ల నుంచి వచ్చే కేలరీలు 45 శాతాన్ని మించొద్దని, పప్పులు-బీన్స్-మాంసం నుంచి 15 శాతం వరకు కేలరీలు అందించాలని పేర్కొంది. మిగిలిన కేలరీలు గింజలు, కూరగాయలు, పండ్లు మరియు పాల నుండి రావాలి. మొత్తం ఎనర్జీలో కొవ్వులను తీసుకోవడం 30 శాతం శక్తి కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలని మార్గదర్శకాలలో చెప్పారు.

Exit mobile version